Dev as Janasena Party Election Strategist! ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ: పవన్ కల్యాన్

Pawan kalyan announces dev as janasena party election strategist

pawan kalyan, janasena, Dev, election strategist, Andhra pradesh all constituencies, Pawan Kalyan Political party, strengthening jana sena, pawan kalyan press meet, Telangana, andhra pradesh, politics

Janasena Supremo Pawan Kalyan has announced Janasena Party’s Election strategist. In a meeting held with key leaders of the party, Pawan Kalyan has announced Dev as the party’s election strategist.

ITEMVIDEOS: ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ: పవన్ కల్యాన్

Posted: 05/01/2018 05:34 PM IST
Pawan kalyan announces dev as janasena party election strategist

రాష్ట్రంలో తృతీయ ప్రత్యమ్నాయ పార్టీగా అవిర్భవించిన జనసేన.. 2019లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణలో తాము బరిలో నిలుస్తామని జనసేన స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలుపుతున్నట్లు ఆ పార్టీ అధినేత జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెల్లడించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలోనూ పోటీ చేస్తామని చెప్పిన పవన్.. తెలంగాణలో తమ విధానం ఎలా వుండబోతుందన్న విషయాన్ని ఆగస్టు మాసంలో ప్రకటిస్తానని చెప్పారు.

హైదరాబాదులో ఇవాళ జరిగిన 13 జిల్లాల ప్రతినిధుల సమావేశంలో పవన్ కల్యాణ్ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళదామని పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. బూత్‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికబద్ధంగా అడుగులు వేద్దామని అన్నారు. అనుభవం లేదని ఎవరైనా అంటే దాన్ని తిప్పికొట్టాలన్నారు. పోటీ చేయలేకపోవచ్చు.. కానీ రెండు సంస్థాగత ఎన్నికల్లో పని చేసిన అనుభవం ఉందన్నారు. సగటు మనిషి.. అణగారిన వర్గాల గొంతుకగా జనసేన ఉండాలని కార్యకర్తలకు పవన్ సూచించారు.
 
ఈ సందర్భంగా జనసేన పార్టీ వ్యూహకర్తగా దేవ్ ను నియమించామని పవన్ పార్టీ మఖ్యకార్యకర్తలకు పరిచయం చేశారు. గత పదినెలలుగా పార్టీ కార్యక్రమాల రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని కార్యకర్తలకు తెలిపారు. గతంలో తను స్థాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు సంబంధించిన 1200 మంది కార్యకర్తలు దేవ్ టీమ్ కు సహకరిస్తారన్నారు. ఆగస్టు రెండో వారంలో తెలంగాణలో పోటీపై ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగా దేవ్‌ మట్లాడుతూ.. జనసైన్యాన్ని బలోపేతం చేసే ధిశగా అందరం కలసి అడుగులు వేద్దామని అన్నారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో కలిసి పని చేసిన అనుభవం తనకు వుందని చెప్పుకోచ్చిన ఆయన.. ఈ రంగంలో దశాబ్ద కాలంగా ఉన్నానని చెప్పారు. గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్ అని చెప్పిన ఆయన ఎన్నికలప్పుడు వచ్చి ముఖం చూపించి వెళ్లిపోయేటటువంటి రాజకీయ నాయకుడు కాదని అన్నారు. పవన్ కు ప్రజా సమస్యల పట్ల, సామాజిక అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది.

జనసేన పార్టీకి బలమైన భావజాలాల్ని, సిద్ధాంతాల్ని రూపొందించారు. అందుకు పటిష్టమైన వ్యూహాన్ని జోడిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తాం. ఇందుకు బూత్‌స్థాయి నుంచి పకడ్బందీగా ప్రణాళికలు వేసుకోవాలి. నా టీమ్‌కు మీ అందరి సహకారం అవసరం. రాజకీయంగా పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలను, సిద్ధాంతాల్నీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలతో పాటు ఎన్నికల వరకు అనుసరించాల్సిన వ్యూహాల్నీ మీతో ఎప్పటికప్పుడు పంచుకుంటాను. ప్రజలతో మమేకమయ్యే పార్టీ జనసేన.. ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పని చేద్దాం" అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  dev  election strategist  Telangana  andhra pradesh  politics  

Other Articles