Tv actor held in theft case ఎట్టకేలకు చిక్కిన బుల్లితెర నటుడు.. చోరీల ఘనుడు..

Tv actor nagaraju held in theft case

TV Actor, Thief, Nagaraju, guntur naredra, Rachakonda commissionerate, narendra, huzoornagar, suryapet, mahesh bagawat, crime

Tv actor turned thief nagaraju was caught in theft case by rachakonda police, who recovers 14 lakh worth gold and silver ornaments from him and booked under PD act.

ఎట్టకేలకు చిక్కిన బుల్లితెర నటుడు.. చోరీల ఘనుడు..

Posted: 05/01/2018 11:38 AM IST
Tv actor nagaraju held in theft case

చెడు వ్యసనాలకు లొంగిన ఓ నటుడు తన దారిని మార్చుకుని దొంగగా మారాడు. చోరీలు చేయడంలో అరితేరాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నిజమైన చోరులు కూడా చేయనన్ని దొంగతనాలు చేసి.. వాటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేశాడు. తనను దొంగగా మార్చింది మాత్రం చెడు వ్యసనాలేనని చెబుతున్న ఈ టీవీ నటుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరదండాలు వేశారు. దొంగతనాలు చేయడంలో దిట్టగా మారిన అతడు వివిధ ప్రాంతాల్లో లెక్కలేనన్ని దొంగతనాలకు పాల్పడ్డాడు.

పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని లక్కారం రోడ్డు ప్రాంతానికి చెందిన బారి నాగరాజు (23) అలియాస్ నరేందర్ అలియాస్ గుంటూరు నరేంద్ర డిగ్రీ చదువుకి మధ్యలోనే స్వస్తి చెప్పి సెంట్రింగ్ కార్మికుడిగా మారాడు. అనంతరం పెళ్లి చేసుకుని 2016లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. సినీ రంగంపై ఉన్న మోజుతో ప్రముఖ స్టూడియోలో కొంతకాలం ప్రొడక్షన్ విభాగంలో పనిచేశాడు. ఈ క్రమంలో ఓ హాస్య నాటికలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు చాలక ఇబ్బంది పడ్డాడు.

దీంతో దొంగగా మారాడు. దొంగిలించిన నగలను గోల్డ్‌లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకునేవాడు. హుజూర్ నగర్‌లో నాలుగు బైకులు చోరీ చేశాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి, సరూర్‌ నగర్  పోలీస్ స్టేషన్ల పరిధిలో 16 చోరీలు చేశాడు. ఈ క్రమంలో చైతన్యపురి పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి రూ.14,52,500 విలువైన 72 తులాల బంగారు ఆభరణాలు, 310 గ్రాముల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుపై పీడీ చట్టాన్ని ప్రయోగించినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ ఎం.భగవత్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TV Actor  Nagaraju  Rachakonda commissionerate  huzoornagar  suryapet  crime  

Other Articles