14 Children Killed in different road accidents రోడ్డు ప్రమాదాల్లో 14 మంది విద్యార్థుల దుర్మరణం

14 children killed in different road accidents in delhi uttar pradesh

Kushinagar, kushinagar bus tragedy, kushinagar news, kushinagar accident, divine public school, kushinagar school bus accident, kushinagar school van train collision, school children, Gorakhpur, Uttar Pradesh, School bus, Accident, school bus, milk van, kahjaiya nagar metro station, delhi, keshavpuram, crime

In a tragic accidents, 14 school children were killed and 25 in different road accidents, school bus carrying nearly 25 students collided with a speeding train at an unmanned crossing killed 13 students and in another a girl died and 17 other students were injured after a milk tanker rammed into a school van in delhi

ITEMVIDEOS: మహావిషాదం: రోడ్డు ప్రమాదాల్లో 14 మంది విద్యార్థుల దుర్మరణం

Posted: 04/26/2018 01:52 PM IST
14 children killed in different road accidents in delhi uttar pradesh

ధేశరాజధాని ప్రాంతంతో పాటు సమీపంలోని ఉత్తరప్రదేశ్ లో సంభవించిన రెండు ఘోర ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. ఇవాళ ఉదయం ఢిల్లీలోని పశ్చిమ ప్రాంతంలోగల కన్హయ్యనగర్ మెట్రో రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ పాల వ్యాను వేగంగా వచ్చి అదే దారిలో వెళ్తున్న స్కూలు బస్సును ఢీకొన్న ఘటనలో ఏడేళ్ల బాలిక అసువులు బాసింది. కాగా ఈ ఘటనలో మరో 17 మంది విద్యార్థులు తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన లోక్ నాయక్ అస్పత్రికి తరలించి చికిత్సనందించారు అధికారులు. కాగా ఈ బస్సులో కేంద్రీయ విద్యాలయకు చెందిన విద్యార్థులతో పాటు మరో పాఠశాలకు చెందిన విద్యార్థులకు కూడా వున్నారని పోలీసులు తెలిపారు.

ఇక ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ సమీపంలోగని ఖుషినగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రైల్వే క్రాసింగ్‌ వద్ద పట్టాలు దాటుతున్న పాఠశాల బస్సును రైలు ఢీకొట్టడంతో 13 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు తునాతునకలైంది. డివైన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన బస్సును థావే-కపటన్ గంజ్ ప్యాసింజర్ రైలు బెహ్ పుర్వా రైల్వే క్రాసింగ్ వద్ద ఢీకొట్టిందని రైల్వే అధికార ప్రతినిధి వేద్ ప్రకాశ్ వెల్లడించారు. రైలు సివాన్ నుంచి గోరఖ్ పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ఉన్నారని, వారిలో ఎక్కువ మంది 10 సంవత్సరాల లోపు చిన్నారులే అని అధికారులు తెలిపారు. ఘటనలో బస్సు డ్రైవర్ కూడా చనిపోయాడని పోలీసు అధికారి ఓపీ సింగ్ వెల్లడించారు. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఘటన వార్త తన హృదయాన్ని కలచివేసిందని పేర్కోన్నారు. ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల నష్టపరిహారం ప్రకటించారు. వెంటనే ఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు. ప్రమాద ఘటనపై తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించనున్నారు.

‘బెహ్ పుర్వా వద్దనున్న లెవల్‌ క్రాసింగ్ వద్ద కపాలా లేదని,‌. అయితే అక్కడ ఉన్న గేట్‌ మిత్ర బస్సును ఆపేందుకు ప్రయత్నించినా.. బస్సు డ్రైవర్ పాఠశాలకు అలస్యమవుతుందున్న అత్రుతగా బస్సును వేగంగా దాటించేందుకు ప్రయత్నించాడని.. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు ఘోర ప్రమాదం జరిగిపోయింది’ అని దిల్లీలో రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా మృతుల కుటుంబాలకు రూ.2లక్షల నష్టపరిహారం ప్రకటించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles