Fire Mishap In A Rubber industry In Patancheru అగర్వాల్ పరిశ్రమలో మరో అగ్నిప్రమాదం.. కంపెనీ బుగ్గిపాలు

Massive fire breaks out at rubber industry in patancheru

Agarwal Rubber Industry News, Agarwal Rubber Industry fire, Agarwal Rubber Industry updates, Agarwal Rubber Industry loss, Agarwal Rubber Industry patancheru

A major fire broke out at a rubber industry in Sangareddy district during the early hours of Tuesday. The mishap occurred at the Agarwal Rubber Industry in Industrial Area of Patancheru.

అగర్వాల్ పరిశ్రమలో మరో అగ్నిప్రమాదం.. కంపెనీ బుగ్గిపాలు

Posted: 04/24/2018 12:15 PM IST
Massive fire breaks out at rubber industry in patancheru

హైదరాబాద్ నగర శివార్లలోని పటాన్‌ చెరువు పారిశ్రామికవాడలోగల అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో మరోమారు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్రితం రోజు అర్థరాత్రి 2గంటల సమయంలో టైర్లకు మంటలు అంటుకుని అవి క్షణాల్లోనే పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని ఏడు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టైర్లకు మంటలు వ్యాపించడంతో అదుపు చేయడం కష్టమవుతోంది. ఈ ఘటనలో పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. ఆస్తి నష్టం కోట్లలో ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.

 నాలుగు మాసాల వ్యవధిలోనే రెండో పర్యాయం ఈ పరిశ్రమలో మంటలు వ్యాప్తించి.. కోట్ల రూపాయల అస్తులు భుగ్గిపాలు కావడంలో ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. జనవరిలో ప్రమాదం సంభవించిన సమయంలోనే సంస్థ చైర్మన్ గుండెపోటుతో చనిపోయారు. ఇపుడు అదే పరిశ్రమలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా కిలోమీటరు‌ మేర దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ఎందరో కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న అగర్వాల్‌ రబ్బరు పరిశ్రమ అగ్నిప్రమాదంలో బుగ్గి కావడం పట్ల తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సంస్థ గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.30కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. దాని నుంచి తేరుకునేలోపే మరో ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. యాజమాన్యానికి ప్రభుత్వ పరంగా వీలైనంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సంస్థను నమ్ముకుని వున్న కార్మికులకు కూడా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles