Six Maoists killed in fresh Gadchiroli encounter మావోయిస్టులపై పోలీసుల పంజా.. 37కు చేరిన మృతుల సంఖ్య

Six maoists killed in fresh maharashtra gunfight toll reaches 37

Maoists, Gadchiroli, Maharashtra, Maoist encounter, Jimlagatta region, odisha, Andhra Pradesh, Aheri Dalam, anti naxal squad, police forces, encounter

Government troops in western India have killed at least six Maoist rebels in a gunbattle, raising the total death toll of rebels killed over the last three days to 37.

మావోయిస్టులకు భారీ దెబ్బ.. పోలీసుల ఎన్ కౌంటర్లో.. 37కు చేరిన మృతుల సంఖ్య

Posted: 04/24/2018 03:16 PM IST
Six maoists killed in fresh maharashtra gunfight toll reaches 37

మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో కూడా మరో అరుమంది మావోయిస్టులు అసువులు బాసారు. గడ్చిరోలి జిల్లాలోని కాండ్ల రాజారాం ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో అహేరీ తాలూకాలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో అహేరి దళ కమాండర్‌ నందు ఉన్నట్లు సమాచారం. భద్రతా బలగాలు మావోయిస్టుల మృతదేహాలను అహేరికి తరలించారు. దీంతో మొత్తంగా పోలీసుల చేతిలో మరణించిన మావోల సంఖ్య 37కు చేరింది.

ఇక క్రితం రోజున జరిగిన ఎన్ కౌంటర్లో ఆరుగురు నక్సల్స్‌ మరణించారు. అదే జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇదరు దళ నేతలతో సహా 16 మంది మావోలు మృతి చెందిన సంగతి తెలిసిందే. గడ్చిరోలి జిల్లా రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్ గట్ట ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఐజీ శరద్‌ షెలార్‌ తెలిపారు. అయితే ఎంతమంది మరణించారన్న దానిపై కచ్చితమైన లెక్క లేకపోయినా కనీసం ఆరుగురు మరణించారని చెప్పారు. కాగా, ఆదివారం ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుంచి మరికొన్ని నక్సల్స్‌ మృతదేహాలు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కూంబింగ్‌ ఆపరేషన్‌కు భారీ వర్షాలు అడ్డంకిగా మారాయని ఐజీ తెలిపారు.

మందుపాతర పేలి ముగ్గురు మృతి ఒడిశా రాష్ట్రంలోని నబరంగపూర్‌ జిల్లా రాయ్‌గర్‌ సమితి అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మావోయిస్టులు అమర్చిన మందుపాతర ప్రమాదవశాత్తూ పేలడం వల్లే ఈ దుర్ఘటన సంభవించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మరో ఘటనలో చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. సుకుమా జిల్లాలోని పూసుపాల్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తోన్న పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles