cag slams ap govt on pattiseema irregularities పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి, అబద్దాలు.. ఏపీ సర్కార్ కు కాగ్ మొట్టికాయలు

Cag slams ap government on pattiseema project irregularities

Comptroller and Auditor General, CAG, Pattiseema Lift Irrigation Scheme, pattiseema corruption, PLIS, AP Government, Polavaram updates, Polavaram project news, Polavaram project latest, Andra pradesh

The Comptroller and Auditor General (CAG) slammed the AP Government for handling the key irrigation project of the state, Pattiseema Irrigation Project. CAG found irregularities in issuing the contract of the Pattiseema Lift Irrigation Scheme (PLIS).

పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి, అబద్దాలు.. ఏపీ సర్కార్ కు కాగ్ మొట్టికాయలు

Posted: 04/19/2018 07:24 PM IST
Cag slams ap government on pattiseema project irregularities

దేశంలోని అనేక అవినీతి అక్రమాలను భయటపెట్టిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు ఇటు రాష్ట్రంలోనూ భారీ కుంభకోణం జరగిందని నివేదికలో వెల్లడించింది. అయితే ఈ అంశాలు పక్కదారి పట్టేందుకు ఏకపక్షంగా సాగిన అసెంబ్లీలో బీజేపి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమర్థవంతంగా కౌంటర్ ఇస్తూ ప్రభుత్వం అంశాన్ని జనంలోకి వెళ్లనీయకుండా చేయడంలో సఫలీకృతం అయ్యింది. అందుకు టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అన్న అంశాన్ని తెరపైకి పచ్చ మీడియాతో తీసుకువచ్చేలా చేసి.. అదే పెద్ద అంశంగా స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ రచించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి సంబంధించిన 2016 సంవత్సరానికి చెందిన ఆర్థిక లావాదేవీల ఖాతాల వివ‌రాల‌ను కాగ్ వెల్ల‌డించింది. అయితే ఇందులో ఒక్క పట్టిసీమ ప్రాజెక్టులోనే అవినీతి అంచానాలకు మించి జరిగిందని కాగ్ తన నివేదికలో పేర్కోంది. ఏపీలోని చంద్ర‌బాబు స‌ర్కార్ కృష్ణా, గోదావరి జలాలను కలిపిన తొలి ప్రాజెక్టు తమదని గొప్పలు చెప్పుకున్న ప్రాజెక్టులో అసలు అంచనాకు అయిన ఖర్చుకు పొంతన లేకుండా పోయిందని కాగ్ తన నివేదికలో పొందుపర్చింది.

పట్టిసీమ ప్రాజెక్టులో ప్రభుత్వం రూ.371 కోట్ల అవినీతికి పాల్ప‌డ్డార‌ని కాగ్ నివేదిక తేల్చేసింది. ఈ ప్రాజెక్టుఅసులు రూ.1170.25 కోట్లు కాగా, టెండర్లను అహ్వానించే 2015 మార్చి నాటికి దీనిని వ్యయాన్ని రూ. 1427గా సవరించారని.. ఇది ఏకంగా 22శాతం అధికమని కాగ్ తన నివేదికలో పేర్కోంది. ఇక ఈ టెండర్లను మోగా ఇంజనీరింగ్ అండ్ ఇనఫ్రాస్టక్చర్ సంస్థకు అప్పగించిన ప్రభుత్వం పూర్తిగా ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతిని ఇచ్చిన తరువాత అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.1600 కోట్లకు పెంచిందని కాగ్ వెల్లడించింది.

ఇరవై ఏళ్ల పాటు పట్టిసీమ ప్రాజెక్టు జీవితకాలం వుంటుందని ప్రాజెక్టు డీటైల్డ్ రిపోర్టులో పేర్కొన్న ప్రభుత్వం.. కేవలం పోలవరం ప్రాజెక్టు పూర్తేయ్యే వరకు ఈ ప్రాజెక్టు నడుస్తుందన్నది అసలు విషయం. అయితే ప్రాజెక్టు రిపోర్టులో కూడా తప్పులను చేర్చి అనుమతులు పోందారన్న విషయాన్ని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. రూ.371 కోట్ల అవినీతి కూడా ఒక్క ప‌ట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన‌దే. రూ.371 కోట్ల అవినీతే కాకుండా మ‌రో రూ.19 కోట్లు ప‌ట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణ‌మంటూ వృథాగా ఖ‌ర్చు పెట్టారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి ఒరిజిన‌ల్ టెంటడర్ల ప్ర‌కారం, క‌న్వెన్ష‌న్ సిస్టం ప్ర‌కారం నిర్మాణం చేప‌ట్ట‌కుండా దొడ్డిదారిలో టెండ‌ర్ల‌ను పిలిచి చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతికి పాల్ప‌డిందని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది.

ఇక పోలవరం కుడి కాలువ నిర్మాణం పూర్తికాకుండానే ఈ ప‌ట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం పనులు చేయడంపై కూడా కాగ్ నోట్ చేసింది. కుడికాలువ నిర్మాణంతో పాటు నీటిని రవాణ చేసేందుకు చిన్న కాలువల నిర్మాణం కూడా లేదని కాగ్ పేర్కోంది. ఇక ఈ ప్రాజెక్టు తగిన నీటి నిల్వ సామర్థ్యం లేదని, అందుచేత 24 పంపులు వున్నా కేవలం 11 పంపుల సాయంతోనే వరదలు వచ్చిన సమయంలో నీటిని తరలించారని కాగ్ తన నివేదికలో స్సష్టంగా పేర్కొంది.

ఈ పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం కోసం అస‌లు టెక్నాల‌జీతోపాటు ఆల్ట‌ర్నేట్ టెక్నాల‌జీ పేరుతో ఏకంగా 138 కోట్ల రూపాయలను అధికంగా ఖర్చుచేశారని కాగ్ తన నివేదకలో స్పష్టం చేసింది.  మ‌రికొన్ని నిధులను స్వాహా చేశారు. అందులో చంద్ర‌బాబుతోపాటు ఏపీ మంత్రులంతా పాట్న‌ర్లేనంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ సాక్షిగా అరోపించారు. 371 కోట్ల అవినీతి జ‌రిగిన ప‌ట్టిసీమ ప్రాజెక్టుపై వెంట‌నే సీబీఐతో విచార‌ణ చేయించాల‌ని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles