BJP 'compromises', fields scam-tainted Reddy brother ఎటెట్టా..షా.! వాళ్లకు టోకుగా టిక్కెట్లిచ్చి.. అవినీతిపై పోరా.?

Scam tainted reddy brothers may alter karnataka politics once again

Karnataka Assembly elections, Karnataka BJP, BJP candidate list, Gali Somashekhara Reddy, Vivek Reddy, BS Yeddyurappa, Janardhan Reddy, Congress, Politics

BJP has named Gali Somashekhara Reddy from Bellary City seat for the upcoming Karnataka Assembly elections. soon after congress tweeted "Amit Shah's prophecy of Yeddyurappa Govt being the 'Most Corrupt' ever in Karnataka is coming true".

ఎటెట్టా..షా.! వాళ్లకు టోకుగా టిక్కెట్లిచ్చి.. అవినీతిపై పోరా.?

Posted: 04/17/2018 03:59 PM IST
Scam tainted reddy brothers may alter karnataka politics once again

అవినీతిరహిత పాలన అందిస్తున్నామని ఓ వైపు ప్రకటిస్తూనే.. అవినీతి అరోపణలు చుట్టిముట్టిన తమవారిని మాత్రం అందలం అందించే పార్టీ ఏదైనా వుందా..? అంటే సమాధానం చెప్పనక్కర్లేని పరిస్థితి వచ్చేస్తుంది. సాక్షాత్తు బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జైషా.. స్థాపించిన కంపెనీ కోట్లు రూపాయల అర్ఢర్లు ఎలా వచ్చాయన్న విషయంలో అభియోగాలు వస్తే సీబిఐ విచారణ జరగదు. సరికదా దేశం ఈ అంశాన్ని మర్చిపోయేందుకు మరో అంశం తెరపైకి వస్తుంది. ఇది తమవరకు వస్తే.. ఇక తమ పార్టీ వరకు వస్తే మాత్రం అంశమే మరోలా వుంటుంది.

ఓ వైపు అవినీతి అంటూ గగ్గోలు పెడుతూనే అవినీతి సామ్రాటులుగా కీర్తిగడించి.. బంగారు సింహాసనాలు చేయించుకు కూర్చోనే.. బంగారు కంచాల్లో తప్ప బోజనం చేయని వారిగా చెప్పుకోబడిన అవినీతి సముద్రపు రారాజులకు కర్ణాటక ఎన్నికలలో టికెట్లు దక్కాయి. నోట్ల రద్దు వ్యవహార దేశమంతా కరెన్సీ కష్టాలకు అలల్లాడిపోతున్న వేళ.. రంగరంగ వైభవంగా తన కూతురు వివాహం చేసి.. ఔరా అనిపించుకున్న అక్రమ గనుల వ్యవహారంలో జైలుపాలై. బెయిలుపై బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డికి మాత్రం బీజేపి ఏకంగా టోకున సీట్లను సమర్పించేసుకుందన్న వార్తలు వినిబడుతున్నాయి.

సిద్దరామయ్య అవినీతిపరుడు అంటూ ఆయన ప్రభుత్వం గత మూడు నెలల కాలంగా కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లులపై నివేదికను ఇవ్వాలని ఏకంగా సీబిఐ రాష్ట్ర సీఎస్ రత్నకుమారీకి నోటీసులు కూడా జారీ చేస్తూనే.. వారు మాత్రం అవినీతి సామ్రాటలైన వారికి ఏరి కోరి మరీ సీట్లు ఇవ్వడం.. బీజేపీ అవినీతి డొల్లతనం మొత్తం బయటపడుతుంది. నోట్ల రద్దు సమయంలో తన కూతురి వివాహం నేపథ్యంలో నోట్లను ఏకంగా ట్రెజరీ కార్యాలయంలోనే మార్చుకున్నారని, అవి తీసుకురావడంలో 8 లక్షలు మిస్ కావడంతో తనను చిత్రహింసలు పెడుతున్నారని, డ్రైవర్ అత్మహత్య చేసుకున్నా.. ఆ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలియదు.. కానీ అతడు చేసిన అరోపణలపై కూడా ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో కూడా మిస్టరీగా మారింది.

అవినీతి సహించమంటూ ఓ వైపు బీహార్ లో అర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను జైళ్లో పెట్టించిన మోడీ ప్రభుత్వం.. అదే తమ పార్టీలో మాత్రం అవినీతిపరులను పెంచిపోషిస్తున్నారు. మరీ ముఖ్యంగా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలలో అవినీతి పరులకు టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా అదే అరోపణలు ఎదుర్కోన్న యడ్యూరప్పను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించడం కూడా విమర్శలకు దారితీస్తుంది. ఇక అత్యంత ముఖ్యంగా గాలి జనార్థన్ రెడ్డి సూచించిన ఏకంగా తొమ్మిది మందికి పార్టీ అధిష్టానం టిక్కెట్లు కేటాయించదన్న వార్తలు మీడియాలో రావడంతో.. అసలు పార్టీలో అవినీతిపరులకే పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.

బీజేపీ ఇంతవరకు ప్రకటించిన రెండు జాబితాల్లోనూ ఆయన సూచించిన వారికే టికెట్లు దక్కయన్న వార్తలు వినబడుతున్నాయి.. ఎంపీలు ఈసారి శాసనసభ ఎన్నికల బరిలోకి నిలచేందుకు ప్రయత్నించినా.. కుదరదని చెప్పిన అధిష్ఠానం.. గాలికి అత్యంత సన్నిహితుడైన బళ్లారి ఎంపీ శ్రీరాములుకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఆయనకు మొళకాల్మూరు టికెట్‌ను కేటాయించగా.. గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డికి బళ్లారి సిటీ టికెట్‌ కేటాయించారు. బళ్లారి టికెట్ ను సణ్ణఫక్కీరప్పకు, సిరిగుప్ప టికెట్ ను ఎం.ఎస్.సోమలింగప్పకు, హగరిబొమ్మనహళ్లి టికెట్ నేమిరాజ్‌ నాయక్ కు కేటాయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles