IT notice served to Karnataka CS సిద్దూ సర్కార్ పై బీజేపి పైఎత్తు.. ఎన్నికల వేళ ఐటీ నోటీసులు..

It department seeks details of govt payments made to contractors

Karnataka elections, income tax department, payments to contractors, Siddaramaiah, Congress, BJP, Yeddurappa, rabridevi, cbi searches, tejashwi yadav, Bihar, PM Modi, politics

The I-T department's notice was sent to Karnataka Chief Secretary Ms Ratna Prabha states that five government departments in Karnataka had made payments to contractors for 'election purposes'.

సిద్దూ సర్కార్ పై బీజేపి పైఎత్తు.. ఎన్నికల వేళ ఐటీ నోటీసులు..

Posted: 04/10/2018 04:59 PM IST
It department seeks details of govt payments made to contractors

దక్షిణాదిన ఎలాగైనా తన సత్తాను చాటాలని భావిస్తున్న ప్రధాని మోడీ, షా ద్వయం.. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై గురిపెట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను టార్గెట్ చేసిన బీజేపి ఆయన అవినీతిపరుడని అరోపణలు చేసింది. అయితే కన్నడీగులు మాత్రం యడ్డీ హాయంలోని బీజేపి ప్రభుత్వం కన్నా సిద్దూ నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనే బాగుందని అభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే ప్రీఫోల్ సర్వేలు, సిద్దూకు అనుకూల వాతావరణం రాష్ట్రంలో నెలకొందని స్పష్టం చేసింది

దీంతో ఎలాగైనా సిద్దూను అవినీతిపరుడని ముద్రవేస్తే తప్ప.. తమ పార్టీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని భావనకు వచ్చిన కేంద్రం.. సిద్దూ సర్కార్ ను సరిగ్గా ఎన్నికల వేళ.. ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తూ ఆదాయ పన్ను నోటీసులు పంపింది. మార్చి 31తో ముగిసిన 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చివరి త్రైమాసికంలో రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చేసిన భారీ చెల్లింపుల వివరాలను తమకు పంపాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభకు ఐటీ నోటీసులు అందాయి.

త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఖర్చు పెట్టేలా పలువురు కాంట్రాక్టర్లకు సిద్దరామయ్య ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు చెల్లించిందనే బీజేపీ నేతల ఆరోపణల నేపథ్యంలో ఐటీ నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మే 12న ఒకే విడతలో జరగనున్న కర్ణాటక ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున డబ్బులను ఖర్చు చేసేందుకు గాను కాంట్రాక్టర్లుకు నిధుల వరద పారించిందని తమకు సమాచారం అందినట్టు సిద్దూ ప్రభుత్వానికి ఈనెల 6న పంపిన నోటీసుల్లో ఐటీ శాఖ పేర్కొనడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు వివిధ ప్రభుత్వ శాఖలు కాంట్రాక్టర్లకు చెల్లించిన వివరాలను తమకు అందించాలని నోటీసుల్లో పేర్కొంది.

కాగా ఈ నోటీసులపై స్పందించిన రత్నప్రభ.. అన్ని వివరాలను అందించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, ఐటీ శాఖకు అన్ని వివరాలూ అందజేస్తామని మీడియాకు తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలు ఏ రూపంలో ఉన్నా సహించవద్దని కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే కేంద్రంలో అధికారంలో వున్న ప్రధాని, అమిత్ షాలు అనేక పర్యాయాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఓ వైపు వస్తూనే వుండగా, ఇటు ఐటీ, సిబిఐ, ఈడీ తదితర సంస్థలను కూడా కేంద్రం తమకు అనుకూలంగా వినియోగించుకుంటుందన్న అరోపణలు వినబబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles