Mayawati lashes out at Amit Shah మిత్రపక్షాల నమ్మకాన్ని కోల్పోయిన మీరా చెప్పేది..

Mayawati lashes out at amit shah says bjp is power drunk

mayawati condemns amit shah, amit shah animal remark, bsp chief mayawati, mayawati amit shah, narendra modi, parliament budget sessions, animal remark, bsp, bjp, narendra modi, parliament, budget sessions

The BSP lashed out at Bharatiya Janata Party president Amit Shah for likening opposition parties trying to join hands against the BJP to 'snakes', 'Mongoose', 'dogs' and 'cats'.

మిత్రపక్షాల నమ్మకాన్ని కోల్పోయిన మీరా చెప్పేది..

Posted: 04/07/2018 05:55 PM IST
Mayawati lashes out at amit shah says bjp is power drunk

ఓ వైపు తాను ప్రధాని కావడాన్ని జీర్ణంచుకోలేక విపక్షాలు హింసను ప్రోత్సహిస్తున్నాయని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ఓ వైపు అరోపించి.. ఇందుకు నిరసనగా ఈ నెల 12న బీజేపి ఎంపీలంతా ఒక్కరోజు నిరాహర దీక్షకు పూనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక ఇదే తరుణంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా విపక్షాలను కుక్కలు, పిల్లులు, ముంగీసలు, పాములు అంటూ మండిపడ్డారు. దీంతో బీఎస్సీ అధినేత్రి మాయావతి కూడా అదే స్థాయిలో షాకు కౌంటర్ ఇచ్చారు.

బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన ప్రతిపక్షాలను జంతువులతో పోల్చడంపై అగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా మీతో జతకట్టిన టీడీపీ సహా పలు మిత్రపక్షాలు మీకు దూరం కావడంతో బీజేపీ ఏకాకిలా మారి అవాక్కులు చెవాక్కులు పేలుస్తున్నారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఉపఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పడంతో ఆ పార్టీ నేతలకు దిక్కుతోచడం లేదు. దీని కారణంగానే ‘‘అవమానకర’’ భాషతో దూషణకు దిగుతున్నారని అమె మండిపడ్డారు.

ఉపఎన్నికలకు ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రతిపక్షాలపై నోరుపారేసుకుని భారీ మూల్యం చెల్లించుకున్నారని మాయావతి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ‘‘శిష్యుడు’’ అమిత్ షా నాయకత్వంలో ఆ పార్టీ విలువలు ఎంత దిగజారాయో తాజా వ్యాఖ్యలు రుజువుచేస్తున్నాయని బీఎస్పీ అధినేత తన లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పతిపక్షాలను ఎంత గౌరవించాలన్న విషయం కూడా తెలియకుండా బీజేపి పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు.
 
‘‘బీజేపీ చెప్పిన నవ భారతం ఇలాగే ఉంటుందా? అసహ్యమైన మాటలు, చులకన చేసే వ్యాఖ్యలతో దేశాన్ని నిర్మిస్తారా? భారత అధికార పార్టీకి ఇది తగునా?’’ అని మాయవతి సూటిగా ప్రశ్నించారు. అతివిశ్వాసం, అహంకారం కారణంగా ఆ పార్టీకి మిత్రపక్షాలన్నీ దూరమయ్యాయనీ... దీంతో ఇప్పుడు బీజేపీ ఏకాకిగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చకపోవడం వల్ల... ఎప్పటినుంచో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సైతం బీజేపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mayawati  amit shah  animal remark  bsp  bjp  narendra modi  parliament  budget sessions  

Other Articles