Goa placed on terror alert గోవాపై ఉగ్రవాదుల గురి.. హెచ్చరించిన ఐబీ..

Alert issued in goa after intel warns terrorists may strike from sea

goa terror attack,alert issued in Goa,Goa on alert,terrorists in arabian sea,Goa ports minister Jayesh Salgaoncar,water sports in Goa,cruise ships in Goa,fishing in Goa, terrorists, boat, HIGH ALERT, gujarat, mumbai, coastal areas, Jayesh Salgaoncar, Intelligence bureau

The Southern Indian state of Goa has sounded an alert to all ships and casinos operating off the state's coast after an intelligence agency warned about a possible terror attack from the sea.

బోటులో ఉగ్రవాదులు.. తీరప్రాంతాలను హెచ్చరించిన ఐబీ..

Posted: 04/07/2018 11:03 AM IST
Alert issued in goa after intel warns terrorists may strike from sea

పాకిస్థాన్ తీవ్రవాదులు కరాచీ నుంచి బోటులో బయలుదేరారని సమాచారం అందుకున్న ఇంటలిజెన్స్ భారత తీరప్రాంతాలను హెచ్చరించింది. తీరప్రాంతాల్లో వున్న ప్రభుత్వాలను, పోలీసుల యంతంగ్రాలను, కోస్టుగార్డులను అప్రమత్తం చేసింది. మరీ ముఖ్యంగా గోవాపై దాడికి బయలుదేరారరన్న సమాచారంతో గోవా సహా సముద్ర తీరప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది.

మత్య్సకారులు ఉపయోగించే బోటు ద్వారా ఉగ్రవాదులు గోవాలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఓడ రేవుల మంత్రి జయేష్ సాల్గోవాంకర్ తెలిపారు. తీరంలో ఉన్న క్యాసినోలు, వాటర్ స్పోర్ట్స్ ఆపరేటర్లు తదితరులకు హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ తీర ప్రాంతంపై ఉగ్రవాదులు దాడిచేసే అవకాశం ఉందని సమాచారం అందిందని మంత్రి తెలిపారు. కోస్ట్ గార్డు అధికారులు అప్రమత్తంగా వుండాలని ఉగ్రవాదుల బోటు ఎక్కడ కనిపించినా వెంటనే చర్యలు తీసుకోవాలని, తీరప్రాంత ప్రజలను కూడా అలెర్ట్ చేయాలని అదేశించారు.

ముంబై నుంచి గుజరాత్ తీరం వరకు ఉగ్రవాదులు ఎక్కడైనా దాడికి పాల్పడే అవకాశం ఉండడంతో తీర ప్రాంతం మొత్తం అలెర్ట్ ప్రకటించినట్టు చెప్పారు. గతంలో పాకిస్థాన్ సీజ్ చేసిన భారత ఫిషింగ్ బోటులో ఉగ్రవాదులు మన సముద్ర తీరప్రాంతం వైపు వస్తున్నారని తమకు ఇంటలిజెన్స్ వర్గాల ద్వార సమాచారం అందినట్లు వెల్లడించారు. కరాచీ నుంచి ఉగ్రవాదులతో బయలుదేరిన బోటు భారత తీరప్రాంతంలో ఎక్కడైనా ఒడ్డుకు చేరే అవకాశం ఉందని మంత్రి సాల్గోవాంకర్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : terrorists  boat  HIGH ALERT  gujarat  mumbai  coastal areas  Jayesh Salgaoncar  Intelligence bureau  

Other Articles