pawan kalyan begins march at Vijayawada జనసేన, వామపక్షాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్ర

Pawan kalyan begins march at vijayawada

pawan kalyan, janasena, vijayawada, amaravati, cpm madhu, cpi rama krishna, benz circle, ramavarappadu, AP capital, Pawan Kalyan Political Yatra, pawan kalyan press meet, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan paid tribute to Dr. BR Ambedkar in vijayawada before participating in national Highway march along with left parties

జనసేన, వామపక్షాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్ర

Posted: 04/06/2018 10:18 AM IST
Pawan kalyan begins march at vijayawada

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన చట్టంలో పేర్కొన్న హమీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన, వామపక్షాల నేతలు ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు జాతీయ రహదారులపై పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఇవాళ నిర్ధేశించుకున్న సమయానికి  విజయవాడలోని నిత్యం రద్దీగా వుండే బెంజ్ సర్కిల్ లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. ఘన నివాళులు అర్పించారు జనసేన అధినేత పవన్ కల్యాన్.

రద్ది రోడ్డుపై ఆయన కోసం ఎదురుచూస్తున్న వేలాది అభిమానులకు ఉత్తేజపర్చిన ఆయన బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా కాసింత ముందుకు తన కారులో వచ్చిన పవన్.. అక్కడ పాదచారుల కోసం ఏర్పాటు చేసిన పేవ్ మెంట్ పై పాదయాత్ర చేస్తూ ముందుకు కదిలారు. ఈ సమాచారం అందుకున్న పార్టీ నేతలు, జనసైనికులు, వామపక్ష కార్యకర్తలు ఆయన వెంట వేలాదిగా తరలివెళ్లి పాదయాత్ర చేశారు. విజయవాడలోని బెంజ్ సర్కిర్ నుంచి రామవరప్పాడు వరకు అరు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించేందుకు జనసేన నిర్ధేశించగా, నిర్ణీత సమయానినిక పాదయాత్ర కొనపాగింది.

ప్రజా ఉధ్యమాలను నిర్వహించేందుకు తాను పూర్తిగా వ్యతిరేకమని, ప్రజలకు ఏం కావాలో అదే తాను అధికారంలో వున్న ప్రభుత్వాలను కోరుతానని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన పవన్.. తనను వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు నిర్వహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉసిగొల్పవద్దని ఇప్పటికే చెప్పారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తాత్సార వైఖరిని నిరసిస్తూ ఆయన వామపక్ష పార్టీలతో కలసి జాతీయ రహదారులపై పాదయాత్రను నిర్వహించారు.

అయితే ఇందుకోసం విజయవాడకు చెందిన ప్రజలకు కాసింత అసౌకర్యం కలుగుతుందని.. అయితే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం నేపథ్యంలోనే తాము ఈ పిలుపునిచ్చామని విజయవాడవాసులు సహృదయంతో అర్థం చేసుకోవాలని కూడా పవన్ ఇప్పటికే విన్నవించారు. కాగా పవన్ వెంట ఏకంగా కీలోమీటర్ల మేర అభిమానులు, పార్టీ నేతలు, వామపక్ష నేతలు కదిలారు. జపసేన సైనికులు, ప్రత్యేక హోదా కోరుతున్న యువత, సంఘాలు పవన్ వెంట కదిలడంతో రహదారి పోడవునా అరుణవర్ణ, శ్వేతవర్ణ పతాకాలు రెపరెపలాడాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles