Blackbuck Poaching Case: Salman Khan Convicted కృష్ణ జింకల కేసు: సల్మాన్ ఖాన్ దోషే.. రెండేళ్ల జైలు శిక్ష

Salman khan convicted saif ali khan and other actors acquitted by jodhpur court

Blackbuck poaching case, Blackbuck Poaching Case live updates, Hum Saath Saath Hain, neelam, Saif ali khan, Salman Khan, Salman Khan controversy, Sonali Bendre, Tabu

Bollywood Actor Salman Khan convicted in the 1998 blackbuck poaching case by Chief Judicial Magistrate Dev Kumar Khatri. Other accused actors Saif Ali Khan, Sonali Bendre, Tabu and Neelam Kothari, however, have been acquitted in the 20-year-old case.

కృష్ణ జింకల కేసు: సల్మాన్ ఖాన్ దోషే.. ఐదేళ్ల జైలు శిక్ష

Posted: 04/05/2018 11:10 AM IST
Salman khan convicted saif ali khan and other actors acquitted by jodhpur court

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ను రాజస్థాన్ లోని జోధ్ పూర్ కోర్టు దోషిగా తేల్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితానికి సంబంధించిన కృష్ణ జింకల వేట కేసులో.. వన్యప్రాణుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 9, 51ల మేరకు న్యాయస్థానం సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్థారించింది. కాగా ఈ కేసులో మరికొద్దిసేపట్లో ఆయనకు ఏ శిక్షను విధిస్తారన్నది న్యాయస్థానం తీర్పులో వెలువరించింది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. ఆయనతో పాటు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న ఇతర నటీనటులు సైఫ్ అలీఖాన్, సోనాలి బింద్రే, టబు, నీలమ్ కొఠారీలను నిర్ధోషులుగా ప్రకటించింది.

1998కృష్ణ జింకలను వేటాడిన కేసులో మార్చి 28నాటికి తుదివాదనలు పూర్తయ్యాయి. అయితే చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్‌కుమార్ కత్రి తీర్పును వాయిదా వేశారు. ఈరోజు కేసు విచారణకు రాగా సల్మాన్‌ఖాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. 1998లొ హమ్ సాథ్ సాథ్ హై అన్న చిత్రం నిర్మాణం సందర్భంగా జోధ్పూర్ అటవీ ప్రాంతానికి వచ్చిన వీరు.. అడవిలోకి అనుమతి లేకుండా ప్రవేశించి.. స్థానికంగా వున్న కంకని గ్రామంలో కృష్ణ జింకలను వేటాడినట్లుగా అరోపణలు వచ్చాయి. దీనిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. సుమారు 20 ఏళ్ల విచారణ అనంతరం ఈ కేసులో సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చింది న్యాయస్థానం.

అయితే న్యాయనిపుణులు మాత్రం ఇప్పటికే సల్మాన్ ఖాన్ వన్యప్రాణ చట్టంలోని సెక్షన్ 51 ప్రకారం ఏడాది నుంచి ఆరేళ్ల వరకు శిక్ష పడే అవకాశముందని చెబుతున్నారు. అయితే సల్మాన్ ఖాన్ కోసం జోద్పూర్ అధికారులు జైలు గదిని కూడా శుభ్రం చేసి రెడీగా వుంచారు. అయితే ఆయన గదిలో ఏలాంటి ప్రత్యేక వసతులు, సదుపాయాలు కల్పించలేదని కూడా చెబుతున్నారు. అయితే ఇదే జైలులో వున్న రాజస్థాన్ గ్యాంగ్ స్టర్ సల్మాన్ ను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో అతనికి ప్రత్యేక భద్రతను కల్పిస్తామని జైలు అధికారులు చెప్పారు.

సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష:

కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. దాదాపు ఇరవై ఏళ్ల తరువాత ఈ కేసులో తీర్పును వెలువరించిన జోధ్ పూర్ న్యాయస్థానం.. సల్మాన్ దోషిగా నిర్థారించిన అనంతరం ఆయనను దోషిగా నిర్థారించి ఐదేళ్ల కారగార శిక్షను విధించింది. సల్మాన్ కు శిక్ష ఖరారుకాగానే, ఆయన్ను జోధ్ పూర్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసిన పోలీసులు, కోర్టు ఆవరణలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో ఆయన్ను జైలుకు తరలించనున్నారు.

మూడేళ్లకు పైగా శిక్ష పడిన నేపథ్యంలో ఆయనకు వెనువెంటనే బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసే అవకాశం వున్నా.. ఆయన కోర్టు తీర్పును అనసరించి తప్పకుండా జైలుకు తరలించాల్సిన అవసరం వుంది. ఆయితే సల్మాన్ చేస్తున్న సామాజిక చర్యలను కూడా దృష్టిపెట్టుకుని అయనకు రెండేళ్ల శిక్ష వేయాలన్న ఆయన తరపు న్యాయవాదుల వాదనలను తిరస్కరించిన న్యాయస్థానం ఆయనకు ఐదేళ్ల శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఇక ఈ కేసులో మిగతా నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై బిష్ణోయి సభ వెంటనే తమ రాష్ట్ర హైకోర్టులో అపీలు చేయాలని నిర్ణయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles