jana sena, left parties to march on national highways 6 నుంచి ఉద్యమ కార్యచరణకు జనసేన, వామపక్షాల పిలుపు

Jana sena left parties to march on national highways pawan kalyan

pawan kalyan, janasena, vijayawada, left parties, amaravati, cpm, madhu, cpi, ramakrishna, marching on national highways, agitation, andhra pradesh special status, TDP, YSRCP, Student Unions, Employees unions, intellectuals, worker unions, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan announces that on 15, 24 april, and may 6 he decides to go on agitation demanding special status to andhra pradesh along with left parties.

ITEMVIDEOS: 6 నుంచి ఉద్యమ కార్యచరణకు జనసేన, వామపక్షాల పిలుపు

Posted: 04/04/2018 03:38 PM IST
Jana sena left parties to march on national highways pawan kalyan

రాష్ట్రంలో తృతీయ ప్రత్యమ్నాయ పార్టీగా అవిర్భవించిన జనసేన.. ప్రత్యేక హోదా విషయంలో అటు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి తమ సెగను తాకేందుకు శాంతియుతంగా అందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నెల 6న ఏపీలో పాదయాత్ర చేస్తామని, ముఖ్యంగా జాతీయ రహదారుల్లో, పలు ముఖ్య కూడళ్లలో నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. పూర్తి శాంతియుత పద్ధతిలో ఢిల్లీని తాకే విధంగా నిరసన ఉంటుందని, ఈ పాదయాత్రలో జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. ఇక జనసేన సహా వామపక్షాల ముఖ్యనేతలు విజయవాడలోనే ఈ అందోళన కార్యక్రమాల్లో పాల్గోంటారని తెలిపారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంలో కేంద్రం అన్యాయం చేస్తోందని పవన్ కల్యాణ్ అరోపించారు. కనీసం సభలో ఏపీ అధికార, విపక్షపార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణాలపై చర్చకు రానీయకుండా వాయిదాలు వేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టని దుయ్యబట్టారు. సభాకార్యక్రమాలు సజావుగా సాగేలా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించడం కూడా వ్యవస్థకు ప్రమాదకరమని ఆయన అన్నారు.
అలాగే, ఇటీవల ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్ట సవరణ చేస్తోన్న నేపథ్యంలో నిర్వహించిన బంద్ లో 14 మంది మంది మృతి చెందడం, గాయాలపాలవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ చర్యను తాము ఖండిస్తున్నామని అన్నారు.

రాష్ట్రంలో రాష్ట్రీయ పార్టీలుగా అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు, అరోపణలు గుప్పించుకోవడంలో తప్పులేదని.. అయితే అదే హస్తినకు వెళ్లి కూడా కొనసాగించడం మంచి పరిణామం కాదని, ఇది రాష్ట్ర ప్రజలకు శాపంగా పరిణమిస్తుందని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లిన పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుండా పరస్పరం నిందలు వేసుకుంటున్నారని విమర్శించారు. సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 8న వామపక్షాలు బంద్ కు పిలుపు ఇవ్వకుంటే రాష్ట్రంలో ఇంత వేగంగా పరిణామాలు మారేవికాదన్నారు.

ఇక పవన్ కల్యాన్ కూడా అవిశ్వాసం పదం తీయకపోయుంటే.. ఏ పార్టీ దానిపై దృష్టి సారించేది కాదని అన్నారు. ఇవాళ దేశరాజకీయాలలో అంధ్రప్రదేశ్ అంశమే చర్చనీయాంశంగా మారిందని అన్నారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపకపోవడం దారుణమని అన్నారు. కేంద్రం అవిశ్వాసానికి జంకి సభలను వాయిదా వేయించి పారిపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శఇంచారు. రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడే క్రమంలో తాము దశల వారీగా ప్రణాళికలు ప్రకటిస్తామని చెప్పారు. ఏపీ అంట అమరావతి, పోలవరం అని చంద్రబాబు ప్రభుత్వం పేర్కోనడాన్ని తప్పబట్టిన రామకృష్ణ ఏపీ అంటే అనంతపురం టు పార్వతీపురం అని అన్నారు. ఇక అనంతపురంలో ఈ నెల 15న, ఒంగోలులో ఏప్రిల్ 24, విజయనగరంలో మే6న సదస్సులు, సభలు ఏర్పాటు చేస్తున్నామని, మేధావులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  left parties  cpm  cpi  madhu  ramakrishna  national highways  andhra pradesh  politics  

Other Articles