telangana government cash back offer on property tax ఆస్తి పన్ను చెల్లింపుపై బ్రహ్మాండమైన ఆఫర్

Telangana government cash back offer on property tax

telangana government, Telangana municipalities, municipal residents, cash back offer property tax, property tax, greater huderabad municipal corperation, muncipal department, Telangana wide municipalities

telangana government gives its municipal residents a cash back offer on paying their property tax in advance after it was sucessful in greater huderabad municipal corperation, muncipal dept wants to impliment it in state wide municipalities.

ఆస్తి పన్ను చెల్లింపుపై బ్రహ్మాండమైన ఆఫర్

Posted: 04/02/2018 03:05 PM IST
Telangana government cash back offer on property tax

ఓ వైపు ఆస్తి పన్ను చెల్లించకుండా ఏళ్లుగా ఎగవేస్తూ.. ప్రభుత్వ అధికారులు ఇచ్చే నోటీసులపై కూడా స్పందించకుండా కోట్ల నుంచి లక్షల రూపాయల వరకు బాకాయీలు పడ్డవారి పరువు తీసేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ మున్సిఫల్ శాఖ అధికారులు.. అదే సమయంలో ముందుగా తమ అస్తి పన్నును చెల్లించే వారికి బ్రహ్మాండమైన ఆపర్ ను కూడా ప్రకటించేశారు. నిర్ణీత గడవులోగా ఆస్తి పన్ను చెల్లించని వారికి ముక్కుపిండి మరీ వడ్డీలు వేసే పురపాలక విభాగం.. అదే తరహాలో ఏప్రిల్ 30 లోపు తమ అస్తి పన్నును చెల్లించే ఇళ్ల యజమానులకు బంపర్ ఆఫర్ గా క్యాష్ బ్యాక్ అఫర్ ను  ప్రకటించింది.

ఏప్రిల్ మాసంలోపు తమ 2018-19వ సంవత్సరపు ఆస్తి పన్నును చెల్లించిన పక్షంలో ఆయా యజమానులకు తమ మొత్తతం పన్నులోంచి ఐదు శాతం మినహాయింపు కల్పించి రాయితీ ఇవ్వనున్నారు. జీహెచ్ఎంసీలో ఇప్పటికే రిబేట్‌ను అమలు చేస్తుండగా.. ఇకపై రాష్ట్రంలోని 73 మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ వర్తింపజేయాలని అధికారులను ఆదేశించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఆస్తి పన్నుల వసూళ్లతో ఆదాయం పెరిగితే అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదని మున్సిపాలిటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిబేట్‌పై విస్తృత ప్రచారం కల్పించి వసూళ్లు ప్రోత్సహించాలని మున్సిపల్‌ కమిషనర్లను కోరింది.

రాష్ట్రంలోని 73 పురపాలికల్లో ఆస్తి పన్ను ఎగవేత వేసిన టాప్‌-100 మంది జాబితాను మున్సిపల్ శాఖ తన పోర్టల్ లో పొందుపరిచింది. కమర్షియల్‌ ఆస్తులకు సంబంధించి ఏళ్లుగా చెల్లించని మొండి బకాయిలు రూ.కోట్లకు ఎగబాకడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వసూళ్ల కోసం పలు మార్లు నోటిసులిచ్చినా లాభం లేకపోవడంతో ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’పద్ధతిలో ఎగవేతదారుల పేర్లు బహిర్గతం చేసేందుకు ఆ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దీంతో ఎగవేతదారులు పన్నులు చెల్లించేందుకు ముందుకొస్తారని ఈ నిర్ణయం తీసుకున్నామని పురపాలక శాఖ అధికారులు తెలిపారు. ఆస్తి పన్నులు ఎగవేస్తే సంబంధిత వ్యక్తుల ఆస్తులు జప్తు చేసే అధికారం మున్సిపాలిటీలకు ఉందన్నారు అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : municipal residents  cash back offer  property tax  GHMC  muncipal department  Telangana  

Other Articles