pawan kalyan gets four police gunmen as security ‘‘అధినేత అలకించారు.. జై జనసేన’’: కళ్యాణ్ దిలిప్

Kalyan dileep sunkara gets valueble advise from hero pawan kalyan

pawan kalyan, janasena, guntur, mangalagiri, Sunkara Dileep, Pawan kalyan, Janasena, Pawan Team, Pawan Fan, Jana sena chief advice to fan, pawan kalyan advice to fan, pawan kalyan kalyan dileep sunkara, Pawan Kalyan Political Yatra, pawan kalyan press meet, pawan kalyan press conference, andhra pradesh, politics

After four years of joining in Janasena, Atlast Kalyan Dileep Sunkara met party President Pawan Kalyan at his office, the actor turned politician gave good advices to hard core fan.

‘‘అధినేత ఆలకించారు.. జై జనసేన’’: కళ్యాణ్ దిలిప్

Posted: 04/02/2018 10:29 AM IST
Kalyan dileep sunkara gets valueble advise from hero pawan kalyan

నటుడిగా వున్నప్పటినుంచి తన హార్డ్ కోర్ అభిమానిగా కొనసాగుతూ.. ఓ వైపు తన అభిమానాన్ని చాటుకుంటూనే.. ఇక తన అభిమాన హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే పార్టీలో చేరి నిన్నమొన్నటి పార్టీకీ సేవలందించిన కల్యాన్ దిలీప్ సుంకరపై గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తల్లో నిజాలు మాత్రం లేవని తేలతెల్లమైంది. దిలీప్ త్వరలోనే జనసేన పార్టీని వీడుతున్నారని, ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైందని వస్తున్న వార్తలు కేవలం కల్పితాలేనని వెల్లడైంది. ఈ మేరకు ఏకంగా కల్యాన్ దిలిప్ సుంకర తన సోషల్ మీడియా (ఫేస్ బుక్) ద్వారా నిర్థారించారు.

జనసేన పార్టీలోని కొందరు వ్యక్తల ద్వారా అవమానాన్ని ఎదుర్కొన్న తాను.. వారిపై  సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డానని, అయితే పార్టీ అధినేత, అభిమాన హీరోతో తాను సుదీర్ఘ సమయం గడపేందుకు కూడా ఇదే అవకాశాన్ని కల్పించిందని ఆయన చెప్పారు. పార్టీలో కొనసాగుతున్న ఈ వ్యవహారం తన దృష్టికి రావడంతో.. ఏకంగా దిలిప్ ను పిలిపించిన.. జనసేనాని.. ఆయనతో భేటీ అయ్యారు. ఆయనకు చాలా విలువైన సలహాలు ఇచ్చారు. సుదీర్ఘమైన సమయం పాటు సాగిన ఈ భేటీ.. తనకో అద్భుతమైన అనుభూతిని కలిగించిందని ఆయన ఫేస్ బుక్ వివరించారు.

41 రోజుల మెడిటేషన్‌తో పాటు.. కొన్ని సూచనలు ఆయన చేశారు. అధినేత సూచనల మేరకు ఈ మండలం(41) రోజులు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటానని కూడా పేర్కొన్నారు. జనసేన సమాజంలోని రుగ్మతలపై పోరాడే పార్టీ.. ఈ పార్టీలో నేతగా కొనసాగుతూ.. వ్యవస్థతో పోరాడే శక్తి వున్నవాడివి.. నీ స్థాయి తెలియని వ్యక్తులతో పోరాడి ఎందుకు దిగజారుతావ్..? అంటూ కూడా పవన్ కల్యాన్ తనకు హితవు పలికారని పేర్కోన్నారు.  ముందుగా సోషల్ మీడియా విమర్శలకు స్పందించడం మానెయ్యాలని, అంతటి నియంత్రణ సాధించగలగాలని ఆయనకు పవన్ సూచించారు.

దీంతో ‘‘జై జనసేన.. జై పవన్ కళ్యాణ్’’ అంటూ నినదిస్తూ.. కళ్యాన్ దిలిప్ సుంకర.. ఈ వ్యవహరామంతా జనసేన పార్టీలోని మరో ఇద్దరు పార్టీ ప్రముఖుల సమక్షంలోనే సాగిందని ఆయన పోస్టులో పేర్కోన్నారు. ఈ క్రమంలో తనను ఎందరో ఎన్నో అంటారని, వాటన్నింటినీ విమర్శిస్తూ కూర్చుంటూ తాను తన గమ్యాన్ని చేరుకోగలనా అంటూ కూడా పవన్ కల్యాన్ తనతో అన్నారని దిలిప్ అన్నారు. దీంతో ఇక జనసేన పార్టీ నేతలకు దిలీప్ సుంకర్ కు మధ్య నెలకొన్న విభేదాలకు పవన్ ఫుల్ స్టాప్ పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Kalyan Sunkara Dileep  Pawan Team  Pawan Fan  facebook  andhra pradesh  politics  

Other Articles