SpiceJet airhostesses accuse airline of strip-search ఎయిర్ పోర్టులో కలకలం.. సెక్యూరిటీ చెక్ పేరుతో నగ్నతనిఖీలా..

Spicejet to investigate allegations of strip search by cabin crew

SpiceJet, airhostesses, accuse, airline, strip-searching, Chennai Airport, Sanitary pads, Cash, stripped

A video showing an angry bunch of SpiceJet airhostesses accusing the airline of strip-searching them at Chennai airport has gone viral, with the airline denying the claims.

ఎయిర్ పోర్టులో కలకలం.. సెక్యూరిటీ చెక్ పేరుతో నగ్నతనిఖీలా..

Posted: 03/31/2018 03:51 PM IST
Spicejet to investigate allegations of strip search by cabin crew

ప్రైవేటు చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ లో కలకలం రేగింది. సంస్థకు చెందిన సెక్యూరిటీ సిబ్బందే చెక్కింగ్ పేరుతో ఎయిర్ హోస్టెస్ ల పట్ల అవమానకరంగా తనిఖీలు చేస్తున్నారని ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో సంస్థలోని ఎయిర్ హోస్టెస్ లు ఇవాళ గళం విప్పారు. వంటిపై నూలు పోగు లేకుండా విప్పించేసి మరీ తనిఖీలు చేస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది తమను పరాభవించేందుకే జరుగుతున్న కుట్రగా వారి పేర్కోన్నారు.

ఇక కొందరు ఎయిర్ హోస్టెస్ లు శానిటరీ నాప్ కిన్స్ ధరించినా వాటిని కూడా తొలగించాలని అదేశించి మరీ తనిఖీలు చేశారని పలువరు ఎయిర్ హోస్టెస్ లు అరోపించారు. ఈ విధమైన ట్రీట్ మెంట్ ను ఓ ఎయిర్ హోస్టెస్ వీడియో రూపంలో బయటపెట్టడంతో కలకలం రేగింది. చెన్నై విమానాశ్రయంలో ఈ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం విధులకు హాజరయ్యే సమయంలో, విధులు ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో విధిగా తనిఖీలు చేయడం సాధారణంగా జరిగేదే.

అయితే, మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఇలా తనిఖీల పేరుతో తమను అసంబంద్ధంగా తాకినట్టు బాధితురాలు మీడియాకు తెలిపారు. గత మూడు రోజులుగా ఇదే విధంగా బట్టలు విప్పించేసి తనిఖీలు చేస్తున్నట్టు బయట పెట్టారు. అయితే, స్పైస్ జెట్ విమానసంస్థ యానమాన్యం మాత్రం ఈ అరోపణలను ఖండించింది. ఎయిర్ హోస్టెస్ లు అరోపిస్తున్నట్లుగా ఏమీ జరగదని సాధారణ తనిఖీలు మాత్రం వారి విధుల్లో భాగంగా జరుగుతాయని పేర్కోంది. ఇక ఈ అరోపణలు నిజమేఅయితే.. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SpiceJet  airhostesses  accuse  airline  strip-searching  Chennai Airport  Sanitary pads  Cash  stripped  

Other Articles