GHMC good news to vehicle owners జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్.. నో.. పార్కింగ్ నాన్సెన్స్..

Ghmc good news no parking nonsence to vehicle owners

GHMC, Commissioner. B. Janardhan Reddy, parking rules, April 1, High Court directions, commercial establishments, Malls, multiplexes, Telangana, Hyderabad

GHMC Commissioner Dr B. Janardhan Reddy today directed all the concerned individuals and agencies manning parking areas in the commercial establishments, Malls, multiplexes and so on to strictly implement the State government order from April 1.

హైదరాబాదీస్.. జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్.. నో.. పార్కింగ్ నాన్సెన్స్..

Posted: 03/30/2018 02:53 PM IST
Ghmc good news no parking nonsence to vehicle owners

హైదరాబాద్ మహానగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా.. వాహనాల పార్కింగ్ పెద్ద సమస్య. మరీ ముఖ్యంగా మాల్స్, మల్టీప్లెక్సుల్లో పార్కింగ్ దందా జడలువిప్పి.. వాహనదారుల జేబులను ఏకంగా కత్తరించేస్తుంది. రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాల నేపథ్యంలో  ఈ అక్రమదందాను అడ్డుకునేందుకు.. తెలంగాణ సర్కారు కొత్త పార్కింగ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన పార్కింగ్ విధానాన్ని తప్పనిసరిగా అన్ని మాల్స్, మల్టీప్లెక్సులు అమలు చేయాల్సిందేనని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ కమిషర్ ఆదేశించారు.

ఈ మేరకు ఆయన మాల్స్, మల్లీప్లెక్సుల యజమానులు, నిర్వాహకులతో చర్చించి.. తప్పనిసరిగా నూతన పార్కింగ్ విధానాలను అవలంభించాల్సిందేనని అదేశాలు జారీ చేశారు. లేని పక్షంగా అదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఇక తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, తొలి 30 నిమిషాల వ్యవధి పాటు ఎటువంటి పార్కింగ్ ఫీజునూ వసూలు చేసేందుకు వీలు లేదు. ప్రతి ఒక్కరికీ బేషరతుగా ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించాల్సిందే. ఆపై 31 నుంచి 60 నిమిషాల వరకూ షాపింగ్ సెంటర్ లో షాపింగ్ చేసినట్టు బిల్లు చూపితే పార్కింగ్ ఫీజును వసూలు చేయకూడదు.

 ఒకవేళ బిల్లును చూపించకుంటే నిర్ణీత మొత్తాన్ని వాహనదారుడి నుంచి తీసుకోవచ్చు. ఆపై గంట దాటితే, పార్కింగ్ మొత్తానికన్నా అధికంగా డబ్బుతో కొనుగోలు చేసినట్టు బిల్లు చూపించాల్సి వుంటుంది. ఒకవేళ, మాల్ లో సినిమాహాల్ ఉండి, దానిలో సినిమాను చూసినట్లయితే, మూడు గంటల సమయం దాటినా పార్కింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. వాహనాల పార్కింగ్ సమయాన్ని తెలిపేలా సరైన ఉపకరణాలను వాడాలని, ఫీజుల వివరాలు అందరికీ కనిపించేలా డిస్ ప్లే చేయాలని అధికారులు ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Workers union leader crushed in haryana
Nation wide emploees strike for two days  

Other Articles