Workers union leader crushed in haryana

workers union, union leader, striking workers, haryana, road transport

workers union leader crushed in haryana during strike.

labour-leader.png

Posted: 02/20/2013 10:12 AM IST
Workers union leader crushed in haryana

    ఈరోజు సార్వత్రిక సమ్మెలో ఉదయాన్నే విషాదం చోటుచేసుకుంది.   హర్యానాలో కార్మిక సంఘ నాయకుడు నరేందర్ సింగ్ అంబాలా బస్ డిపోలోంచి బయటకు పోతున్న బస్సుని ఆపే ప్రయత్నంలో మరి కొందరు కార్మికులతో పాటు అడ్డుగా కూర్చున్న సందర్భంలో ఆ బస్సు అతని మీదుగా పోయి అతని ప్రాణాలు తీసేసిందని వార్త వినవచ్చింది.  అయితే ఇదే సంఘటనను అంతకు ముందు ఎఐటియుసి జనరల్ సెక్రటరీ గురుదాస్ దాస్ గుప్తా, గుర్తు తెలియని వ్యక్తులెవరో కార్మిక నాయకుడిని కత్తితో పొడిచి చంపారంటూ మరోవిధంగా మీడియా కు తెలియజేసారు.  

    కార్మికులు అంబాల పరిధిలోని పోలీస్ కమిషనర్, పోలీస్ స్టేషన్ ఆఫీసర్ వాహనాలను ధ్వంసం చెయ్యబూనారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు.  ఈ దుర్ఘటనకు కారణం ప్రభుత్వం బలవంతంగా బస్సులను నడిపించే మొండి ప్రయత్నానికి పూనుకోవటమేనంటూ హర్యాయానా రోడ్ వేస్ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడుఇందర్ సింగ్ బఢానా విమర్శించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles