prakash raj compared bjp with hitler హిట్లరే పోయారు.. బీజేపి ఎంత.?: ప్రకాష్ రాజ్

Prakash raj questions what is bjp when even hilter has gone

prakash raj, south indian actor, gauri lankesh, social activist, journalits, BJP, bengaluru, karnataka, politics

After his sister Reowned journalist and social activist and Gauri lankesh brutal murder, actor prakash raj targets pm modi and bjp, he says what is BJP, when even hilter has gone

నియంతలే పోయారు.. బీజేపి ఎంత.?: ప్రకాష్ రాజ్

Posted: 03/24/2018 04:53 PM IST
Prakash raj questions what is bjp when even hilter has gone

తన సోదరి, ప్రముఖ సామాజిక కార్యకర్త, జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య తరువాత, ఇలాంటి హత్యలపై ప్రధాని మౌనం వీడాలని ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఇప్పటికే పలు విమర్శలతో కర్ణాటక జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోలేకోనీయకుండా చేస్తున్న విషయంతెలిసిందే. తాజాగా ఆయన మరోసారి ఏకంగా బీజేపి పార్టీని నియంతృత్వ పార్టీతో పోల్చుతూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తప్పుడు హామీలతో దేశ ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందని మండిపడ్డారు. తప్పుడు హామీలతో.. ప్రజలను అశల సంధ్రంలో ముంచి వారి నుంచి ఓట్లు పొందడం ఎక్కువ కాలం సాగదని, ప్రజలను ఎవరూ ఎక్కువ కాలం భ్రమల్లో ముంచలేరని అన్నారు. సర్వ ధిక్కార ధోరణి అనేది కొన్ని రోజుల వరకు మాత్రమే పరిమితమని... ఎంతో కాలం కొనసాగదని చెప్పారు. హిట్లర్ లాంటి వారి ఆధిపత్యమే కూలిపోయిందని... ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంత అంటూ ఎద్దేవా చేశారు.

తాము అధికారంలోకి వస్తే గంగానదిని స్వచ్ఛంగా మారుస్తామంటూ బీజేపీ చెప్పిందని... అధికారంలోకి వచ్చాక కొంతమేర పనులు చేపట్టి, ఆ తర్వాత చేతులు దులిపేసుకుందని విమర్శించారు. మతతత్వాన్ని పెంచి పోషిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. దక్షిణ కన్నడలోని మంజేశ్వరలో ఉన్న శాంతి సేనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prakash raj  south indian actor  gauri lankesh  social activist  journalits  BJP  bengaluru  karnataka  politics  

Other Articles