sabbam hari sensational comments on bjp బీజేపిపై మాజీ ఎంపీ సబ్బంహరి సంచలన వ్యాఖ్యలు

Sabbam hari sensational comments on amitshah and modi

sabbam hari, chandrababu, PM Modi, Amit shah, BJP, TDP, YSRCP, Jana Sena, andhra pradesh special status, andhra pradesh, politics

former congress member of parliament sabbam hari sensational comments on PM Modi and bjp president Amit shah, says BJP trying to defame telugudesam party, and he has the evidence.

బీజేపిపై మాజీ ఎంపీ సబ్బంహరి సంచలన వ్యాఖ్యలు

Posted: 03/22/2018 09:58 AM IST
Sabbam hari sensational comments on amitshah and modi

దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదన్న ప్రధాని నరేంద్ర మోదీ- బీజేపి అధ్యక్షుడు అమిత్ షా ద్వయం కుట్ర వల్లే అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ని కష్టాలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సబ్బం హరి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే టీడీపీని బీజేపి ప్రత్యక్షంగా టార్గెట్ చేసి.. పరోక్షంగా డ్రామాలాడుతోందని అన్నారు. ఈ కుట్రలో భాగమే చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై అవినీతి అరోపణలని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష వైసీపీ పార్టీని జనసేనను ఉపయోగించుకుని టీడీపీని దెబ్బకోట్టాలని బీజేపి ప్రణాళిక రచించినట్లు తనవద్ద పక్కా సమాచారం వుందని అరోపించారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న చంద్రబాబుకు అండగా నిలవకుండా దాని వల్ల తామెలా ప్రయోజనం పొందాలనే అంశంపైనే మిగతా పార్టీలన్నీ దృష్టిసారించాయన్నారు. స్వప్రయోజనాల కోసం అర్రులు చాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీనే అడ్డుకుంటోందని, అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలతో ఆందోళన చేయిస్తోందని తేల్చి చెప్పారు. సాటి తెలుగువారికి అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ ఇలా చేయడం ఎంతమాత్రమూ సబబు కాదన్నారు. మోదీపై ఇది తొలి అవిశ్వాసమని, చర్చకు వస్తే అంతర్జాతీయంగా ఆయన పరువు పోతుందనే అడ్డుకుంటున్నారని అన్నారు.

ఇక రాష్ట్రంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు తెరలేపినా బీజేపీ పని అయిపోయినట్టేనని ఆయన విమర్శించారు. జాతీయ పార్టీకి అంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతు పలికింది కేవలం రాష్ట్రా అభివృద్దిని దృష్టిలో పెట్టుకునేనని చెప్పారు. అయితే ఒకప్పటి బీజేపికి ఇప్పటి నరేంద్రమోడీ, షా ద్వయం బీజేపికి చాలా వత్యాసముందని అరోపించారు. ప్రస్తుతం బీజేపి పార్టీతో ఎవరు కలిసినా మటాషేనని తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు తప్ప ఇంకెవరూ గౌరవంగా మాట్లాడడం లేదని, అడ్డగోలుగా విరుచుకుపడుతున్నారని సబ్బం హరి పేర్కొన్నారు.

బీజేపీకి రానున్న ఎన్నికలలో తాము మద్దతు పలుకుతామని.. అ పార్టీ ఎలా చెబితే అలా నడుచుకుంటామని వైసీపీ అంగీకరించిందని, అయితే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజానికానికి బహిరంగంగా చెబితే మైనారిటీలు దూరం అవుతారన్న భయంతో.. వారి ఓట్లు పోతాయనే ఉద్దేశంతో దానిని గోప్యంగా వుంచేందుకు వైసీని నానాకష్టాలు పడుతుందని మాజీ ఎంపీ సబ్బం హరి పేర్కొన్నారు. మోదీ హోదా ఇస్తారనే విశ్వాసం ఉందంటూనే బీజేపీతో పోరాటం చేస్తామంటున్న జగన్, విజయసాయిరెడ్డిలకు మతి భ్రమించిందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడంతో ప్రజల్లో ఏమూలో ఉన్న అసంతృప్తి పోయిందని సబ్బం హరి పేర్కొన్నారు. హోదా కోసం ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం వల్ల టీడీపీకి మంచే జరిగిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉండడంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా పరిస్థితులను మార్చి తమకు అనుకూలంగా మలచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందన్న అనుమానాన్ని హరి వ్యక్తం చేశారు. కాగా, చంద్రబాబుకు మున్ముందు ఉన్నవి గడ్డు రోజులేనని మాత్రం కచ్చితంగా చెప్పగలనన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే దానిపై ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారని సబ్బం హరి పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles