will tackle tdp blame game says bjp leader purandareshwari టీడీపీ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసింది.. సమర్ధవంతంగా తిప్పికొడతాం..

Will tackle tdp blame game says bjp leader purandareshwari

purandeshwari, BJP Mahila morcha Leader, Arun jaitley, chandrababu naidu, ap special status, amaravati, vijayawada guntur drinage works, andhra pradesh, politics

TDP is playing a mind game to blame BJP party but we will definetley tackle it says bjp womens wing leader purandareshwari, she asks state government which promise was not fulfilled by the centre..?

టీడీపీ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసింది.. సమర్ధవంతంగా తిప్పికొడతాం..

Posted: 03/09/2018 12:50 PM IST
Will tackle tdp blame game says bjp leader purandareshwari

ప్రత్యేక హోదా వల్ల కలిగే లబ్ది కన్నా ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్రానికి ఎక్కువ లబ్ది చేకూరుతుందని ఇన్నాళ్లు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా మాత్రం ప్రత్యేక హోదా విషయాన్ని మళ్లి తెరపైకి తీసుకురావడం కావాలని బీజేపిని బద్నామ్ చేయడానికేనని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. ప్రత్యేక ప్యాకేజీతోనే ఏపీకి లాభం చేకూరుతుందని ప్రత్యేకహోదాతో లాభం ఉండదని జైట్లీ చెప్పారని... జైట్లీ ప్రకటనను తప్పుగా అర్దం చేసుకుని టీడీపీ నేతలు సరికొత్త నాటకానికి తెరతీస్తూ ప్రజల ముందు బీజేపిని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కట్టుబడి వుందని.. అన్యాయానికి గురైన రాష్ట్రానికి కేంద్రం తప్పకుండా న్యాయం చేస్తుందని అమె స్పష్టం చేశారు. ఆర్థికలోటు పూడ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చిందని...అయితే ఇంకా డిజైన్లు ఫైనల్ కాకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోలదన్న విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరముందని అన్నారు. అంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాలతో పాటు రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలకు పన్ను రాయితీలు కొనసాగుతాయని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.

కేంద్రం ఈ ఏడు జిల్లాలలో పన్ను రాయితీలను కల్పించడంతో.. ఆయా ప్రాంతాల్లో సుమారు 10 నుంచి 14 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని కూడా అమె గుర్తు చేశారు. ఇక గుంటూరు విజయవాడ ప్రాంతాలు రాజధానితో అనుసంధానించబడి వున్న కారణంగా అయా ప్రాంతాల్లోని డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపర్చేందుకు కేంద్రం వెయ్యి కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తే పనులు ప్రారంభించిన రాష్ట్రం అర్థాంతరంగా వాటిని అపేసిందని.. ఈ విషయంలో ఏకీభవించని మీడియా మిత్రులతో కలసి తాను ఈ పనులను పరిశీలించేందుకు కూడా సిద్దమని అన్నారు.  టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్యను ఇరు పార్టీల అధ్యక్షులు చూసుకుంటారని చెప్పారు. కేంద్రం ఏపీకి చేసిన సాయాన్ని ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తామని పురందేశ్వరి అన్నారు. కేంద్రం ఏ పనులను చేయలేదో రాష్ట్రప్రభుత్వం చెప్పగలదా..? అని అమె సూటిగా ప్రశ్నించారు.,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles