minor woman files marital rape case against husband భర్త అత్యాచారం చేశడని భార్య పిర్యాదు..

Pune minor woman files marital rape case against husband

Pune, Maharashtra, Alandi, rape, sexually assaulted, marital rape, sexual assault on wife, Suraj Ranga Kulatun, Maharastra, Crime

A man was booked for sexually assaulting his wife who had been forced into the marriage as a minor. Three of his family members, including two women, were also booked in the case.

భర్త అత్యాచారం చేశాడని.. పోలీసులకు భార్య పిర్యాదు..

Posted: 03/09/2018 11:11 AM IST
Pune minor woman files marital rape case against husband

మైనర్ బాలికలను పెళ్లాడిన నేపథ్యంలో వారిపై బలవంతంగా, వారి విముఖతను లెక్కచేయకుండా జరిగే బలవంతపు శృంగారాలను అత్యాచారాలుగా భావించాలా..? వద్ద అన్న విషయంలో వాటిని కూడా నేరాలుగానే భావించాలని ఓసారి, భావించలేమని మరోసారి కేంద్రం డోలాయమానంలో వున్నప్పటికీ.. న్యాయస్థానం మాత్రం నేరంగానే పరిగణిస్తామని ఇటీవలే స్పష్టం చేసింది. అంతే న్యాయస్థానం తీర్పును తెలుసుకున్న క్రమంలో ఓ భార్య తన భర్త తనను మైనారిటీ తీరకుండానే వివాహం చేసుకున్నాడని, తనపై బలవంతంగా అఘాయిత్యానికి కూడా పాల్పడ్డాడని ఏకంగా పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఫూణేలో చోటుచేసుకుంది.

పూణే నగరానికి చెందిన సూరజ్ రంగ కులాతున్ అనే యువకుడు తనను బలవంతంగా పెళ్లి చేసుకొని అత్యాచారం జరిపాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు 17 ఏళ్ల వయసుండగా... 18 ఏళ్లని తప్పుడు ధ్రువీకరణ పత్రం తీసుకొని తన భర్త మోసం చేశాడని ఆరోపించింది. భర్తతోపాటు అతని తండ్రి కూడా తనను లైంగికంగా వేధించాడని, తన పిర్యాదులో పేర్కొంది. తాను కాకుండా తన భర్తకు అంతుకుముందే మరో మహిళతో కూడా వివాహం జరిగిందని.. కాగా తనపై అత్తింటి అరళ్లు కూడా అధికమయ్యాయని, అత్త, మామలు, అడపడచులు తనను మానసికంగా వేధిస్తున్నారని మైనర్ బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ప్రస్తుతం ఇరవై ఏళ్లకు చేరుకున్న సదరు బాధితురాలు తన భర్త తనపై అఘాయిత్యానికి పాల్పడటంతో పాటు తన కుటుంబసభ్యులను అంతం చేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడని, తనతో పాటు తన కుటుంబసభ్యలకు కూడా ఈ హెచ్చరికలు జారీ చేయడంతో తాము నిమ్మకుండిపోయామని పిర్యాదులో పేర్కోంది. కాగా బాధిత మహిళ ఎస్టీ వర్గానికి చెందిన కావడంతో.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుగా కూడా పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. దీంతో బాధితురాలి భర్త, అత్తా, మామలను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles