Actress lodged complaint against a man urinating on her car పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు.. తన కారుపై వ్యక్తి..,

Actress monal gajjar lodged complaint against a man urinating on her car

allari naresh heroine police complaint, gujarati actress police complaint, tollywood actress police complaint, actress, heroine, Payal, Monal Gajjar, Kamlesh Patel, Gulbai Tekra, Gujarat University, allari naresh, tollywood, crime

With women’s day to be celebrated across the globe on Thursday, Gujarat film actress Monal Gajjar showed real women power and lodged a complaint against a man, Kamlesh Patel who was urinated on her car tyre near a complex at Gulbai Tekra.

తన కారుపై చేయకూడని పని.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు..

Posted: 03/08/2018 03:58 PM IST
Actress monal gajjar lodged complaint against a man urinating on her car

ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ మహిళామణుల గొప్పదనంపై ప్రశంసలు కురిపిస్తున్న క్రమంలో ఓ హీరోయిన్ మాత్రం తన నిజమైన మహిళా చైతన్యాన్ని చూపి.. సత్తా చాటింది. మరోరకంగా చెప్పాలంటే మాత్రం టాలీవుడ్ హీరోయిన్ మోనల్ గజ్జర్ కు అమె సొంతరాష్ట్రంలో పరాభవం ఎదురైంది. షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసేందుకు వెళ్లి తిరిగివస్తూ ఓ వ్యక్తి తన కారు వద్ద తచ్చాడటాన్ని చూసి.. అతను చేసిన పనిని బిత్తరపోయి.. తేరుకుని వాదించేలోపు ఆ వ్యక్తి తన పని పూర్తి చేసుకుని వెళ్లిపోవడంతో.. భరించలేకపోయిన అమె ఏకంగా అతడిపై పోలీసులకు పిర్యాదు చేసింది.

ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడు.. హీరోయిన్ కారు వద్ద నిల్చున్న వ్యక్తిపై అమె ఎందుకని పోలీసులకు పిర్యాదు చేసింది..? ఓ వైపు గుజరాత్ నుంచి కేంద్ర రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి.. స్వచ్ఛా భారత్ అంటూ యావత్ దేశాన్ని పరిశుభ్రం చేసే దిశగా అనేక ప్రకటనలు గుప్పిస్తూ.. ప్రచారం చేస్తున్నా.. ప్రధాని సొంత రాష్ట్రంలోనే ఆయన పిలుపుకు అదరణ కరువైంది. ప్రధాని మోదీ క్యాబినెట్ లోని మంత్రులే ఆయన మాటలను లక్ష్యపెట్టడం లేదని భావించాడో లేక మరెందుకో తెలియదు కానీ ఓ వ్యక్తి ఏకంగా షాపింగ్ మాల్ ఏరియాకు చెందిన పార్కింగ్ స్థలంలో నిలబెట్టిన హీరోయిన్ కారు వద్దకు వెళ్లి అమె కారు టైరుపైనే మూత్రవిసర్జన చేశాడు.

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని అంబావాడీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అప్పుడే తిరిగివస్తున్న హీరోయిన్ మోనల్ గజ్జర్ దీనిని గమనించి.. కంగారుపడి అతడిని వారించే ప్రయత్నం చేసింది. అయినా, అతను పట్టించుకోకుండా, తన పనిని అర్థాంతరంగా అపలేక.. పూర్తి చేసేశాడు. దీంతో చిర్రెత్తిన హీరోయిన్ అతడిపై పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తి మాల్ ఎదురుగా ఓ దుకాణాన్ని నిర్వహిస్తుంటాడని పోలీసులు తెలిపారు. గుజరాత్ కు చెందిన మోనల్ గజ్జర్... గుజరాతీ చిత్రాలలో నటిగా రాణించడంతో పాటు ఇటు టాలీవుడ్ లో 'వెన్నెల వన్ అండ్ హాఫ్, 'సుడిగాడు', 'బ్రదరాఫ్ బొమ్మాళి' తదితర చిత్రాల్లో నటించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress  heroine  Payal  Monal Gajjar  Kamlesh Patel  Gulbai Tekra  Gujarat University  allari naresh  tollywood  

Other Articles