మానవుడి జీవితంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైనది. ఈ దశలో యువత సన్మార్గంలో పయనిస్తే.. వారు జీవితాంతం అదే బాటలో పయనిస్తారని, అదే వక్రమార్గం పడితే దేశానికి చీడపురుగులుగా మారే ప్రమాదముందని పెద్దలు అనేక సందర్భాలలో చెప్పారు. పెద్దల మాటలను పెడచెవిన పెట్టిన ఓ విద్యార్థి.. చదువుకునే క్రమంలోనే ఓ అమ్మాయిని ప్రేమలోకి దింపాడు. అమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అమెతో మూడేళ్ల పాటు స్నేహం చేసి.. అమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఆ యువతి అతనికి లొంగకపోవడం.. అతని శారీరిక వాంఛను తీర్చేందుకు నిరాకకరించడంతో అమైపై ద్వేషాన్ని పెంచుకున్న విద్యార్ధి అ యువతికి సంబంధించిన నగ్న చిత్రాలను అంతర్జాలంలో పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. విచారించిన న్యాయస్థానం విద్యార్థికి దిమ్మదిరిగే తీర్పును వెలువరించింది. ఏకంగా ఐదేళ్ల పాటు జైలు శిక్షను విధించింది.
కాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాంలోనే ఈ తరహా కేసు తీర్పు నేపథ్యంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా, న్యాయస్థానం తీర్పు మహిళా అంతర్జాతీయ దినోత్సవం రోజునే వెలువరించడం పట్లు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పన్సుకుర పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థి యానిమేష్ బాక్సీ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మూడేళ్ల పాటు ఆమెతో స్నేహం చేశాడు. అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయి ఫోటోలు, వీడియోలు తీసుకొని... బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. అందుకు యువతి నిరాకరించింది.
దీంతో యువతిపై ద్వేషంతో రగిలిపోయిన బాక్సీ.. ఆమె అర్థనగ్న ఫోటోలను అంతర్జాలంలో అప్ లోడ్ చేశాడు. దీంతో బాధితురాలు యువకుడిపై గత ఏడాది జులై 21 న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మాయి అర్థనగ్న ఫోటోలను ఇంటర్ నెట్ లో పెట్టడంతో ఆయా ఫోటోలను క్లిక్ చేసిన ప్రతీసారి తనపై వర్చువల్ గా అత్యాచారం చేసినట్లయిందని అమ్మాయి కోర్టులో చెప్పింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఐడీ పోలీసులు 60 రోజుల్లోనే దర్యాప్తు చేసి 18 మంది సాక్షులతో చార్జీషీటు వేశారు. దీంతో నేరగాడైన బీటెక్ విద్యార్థి యానిమేష్ బాక్సీకి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 9వేల రూపాయల జరిమానా విధిస్తూ తూర్పు మిడ్నాపూర్ టమ్లాక్ జుడీషియల్ మెజిస్ట్రేట్ గౌతం కుమార్ నాగ్ సంచలన తీర్పు వెలువరించారు.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్‌లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more