Death shriek in Syria Kills More Than 700 | ఆగని మారణ హోమం.. 700 మందికి పైగా దుర్మణం.. శవాల దిబ్బగా సిరియా

Death shriek in syria

Syria, Syria Attack, Syria Is Bleeding, Syria Destruction, Ghouta, Syria Destruction, Chemical Attack, Russia, Syria Military Attack, UNO

Syria's destruction kills More than 700 in Ghouta. Russia orders five-hour daily truce in Syria. Chemical Attack killed more than 16 in East Ghouta.

మారణ హోమం.. 700 మంది మృతి

Posted: 02/27/2018 06:44 PM IST
Death shriek in syria

సిరియా సంక్షోభంతో నెలకొన్న మారణహోమం చల్లారటం లేదు. అంతర్యుద్ధం కారణంగా ఈ వారం రోజుల్లో 700 మంది మృతి చెందారు. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉంటున్నాయి. గౌటా ప్రాంతంలో పట్టుసాధించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమే ఇందుకు కారణం.

చనిపోయినవారిలో 200 మంది చిన్నారులు, 110 మంది మహిళలు కూడా ఉన్నారు. వైమానిక దాడుల్లో ఆస్పత్రి భవనాలు, వందకొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. హెచ్చరికలు జారీ చేయకపోవటంలాంటివి చేయకుండా సైన్యం జనావాసాలపై బాంబులు జారవిడిచాయి. ఇందులో 95 మంది అభంశుభం తెలియని చిన్నారులు ఉన్నారు. తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న తూర్పు గౌటా ప్రాంతాన్ని వశపర్చుకునేందుకు రష్యా సహకారంతో సిరియా సైన్యం వైమానిక దాడులకు పాల్పడుతోంది. సుమారు 4లక్షల మంది నివసిస్తున్న ఈ ప్రాంతం ఇప్పుడు శవాల దిబ్బగా మారిపోయింది.

క్షతగాత్రుల ఆర్తనాదాలతో తల్లడిల్లిపోతోంది. ప్రాణభయంతో జనం బిక్కుబిక్కుమంటూ ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. అయితే.. తిరుగుబాటుదళాలపై యుద్ధంలో రష్యా సహకారం ఉందన్న వార్తలను సిరియా ప్రభుత్వ అనుకూల ‘అల్‌ వతన్‌’ మీడియా కొట్టిపారేసింది.

రష్యా ప్రకటన...
మానవ హక్కులను కాలరాస్తూ సిరియా-రష్యాలు సాగిస్తోన్న బాంబు దాడులపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 25న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం జరిగింది. ‘తక్షణమే సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలి’ అని మండలి తీర్మానించింది.

రష్యా కూడా ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం కాల్పుల విరమణపై రష్యా వెనక్కితగ్గలేదు. ‘మానవతా దృక్పథంతో రోజుకు ఐదు గంటలు మాత్రమే దాడుల్ని ఆపుతాం. ఆ సమయంలోనే జనం సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంగళవారం ఒక ప్రకటన చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Syria  Military Attack  సిరియా  సైనిక దాడి  

Other Articles