Sridevi Death Case Closed by Dubai Prosecution | నో డౌట్స్.. శ్రీదేవి కేసు క్లోజ్

Sridevi death case closed

Sridevi Death Case, Dubai Public Prosecution, Accidental Death, Sridevi Case Close, Sridevi Case, Sridevi Death, Sridevi Dead Body, LetHerRestInPeace

Sridevi death due to accidental drowning, case closed: Dubai Public Prosecution."Dubai Public Prosecution stressed that all regular procedures followed in such cases have been completed. As per the forensic report, the death of the Indian actress occurred due to accidental drowning following loss of consciousness. The case has now been closed."

నటి శ్రీదేవి డెత్ కేసు క్లోజ్

Posted: 02/27/2018 04:48 PM IST
Sridevi death case closed

నటి శ్రీదేవి మరణం చుట్టూ ఇప్పటివరకు ఆవరించిన అనుమానపు తెరలు తొలగిపోయాయి. ఆమె స్పృహ కోల్పోయి ప్రమాదవశాత్తుగానే బాత్ టబ్‌లో పడి చనిపోయారని దుబాయి ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. ఫోరెన్సిక్ నివేదికతో ఏకీభవిస్తున్నట్లు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (డీపీపీ) అధికారులు తెలిపారు. దీంతో ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు.

కాగా, వారి తీరుపై భారత్ లో విమర్శల వెల్లువెత్తిన విషయం గురించి ప్రస్తావించగా.. ఇలాంటి కేసుల్లో అనుసరించాల్సిన అన్ని ప్రక్రియలను పూర్తి చేశామని వారు వెల్లడించారు. కాగా, అంతకుముందు ఆమె మరణంపై సమగ్ర దర్యాప్తును పూర్తి చేసిన పిదప శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె కుటుంబానికి అప్పగించేందుకు వారు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఇప్పటివరకు ఆమె మరణం గురించి ఆమె భర్త బోనీ కపూర్‌ను గంటల తరబడి విచారించినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజా క్లియరెన్స్ నేపథ్యంలో ఆయనకు కూడా ఈ కేసులో దుబాయి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. దాంతో ఆమె భౌతికకాయాన్ని భారత్ తీసుకెళ్లేందుకు ఆయనకు అనుమతి లభించింది. ఏదేమైనా, శ్రీదేవి మరణం తర్వాత అనేక రకాల ఊహాగానాలను తెరపైకి తెచ్చి చివరకు సహజ మరణమని తేల్చటం విశేషం. భారత కాలమానం ప్రకారం, రాత్రి ఆమె భౌతికకాయం స్వదేశానికి చేరుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆమెను కడసారిగా చూసేందుకు ఆమె ఇంటి వద్ద అభిమానులు భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. ఫోటోలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles