Dhanush ballistic missile successfully test fired | భారత అమ్ముల పొదిలో ‘ధనుష్’.. టార్గెట్ ఎంత దూరమో తెలుసా?

Dhanush ballistic missile tested successfully

Dhanush, Ballistic Missile, DRDO. Prithvi-III, Test Fired, Surface Strikes, Dhanush Ballistic Missile

Indian Navy successfully test fires nuclear-capable ballistic missile 'Dhanush' from sea. Dhanush, also called Prithvi-III, can be use for ship-to-ship and ship-to-surface strikes.

ధనుష్ పరీక్ష విజయవంతం

Posted: 02/23/2018 06:10 PM IST
Dhanush ballistic missile tested successfully

మరో విజయవంతమైన క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అణ్వ‌స్త్ర సామ‌ర్థ్యం క‌లిగిన బాలిస్టిక్ క్షిప‌ణి 'ధ‌నుష్' ప‌రీక్ష విజ‌య‌వంతం అయిందని సంబంధిత అధికారులు ప్రకటించారు.

ఒడిశా తీరంలో ఈ క్షిపణి పరీక్ష చేసినట్లు తెలిపారు. భూ, జల త‌లాల నుంచి ఈ క్షిపణిని ప్రయోగించవచ్చని చెప్పారు. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది నాశనం చేయగలదని అధికారులు వివరించారు. ఈ క్షిపణి దాదాపు 500 కిలోల అణ్వస్త్రాలను మోసుకుపోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని వివరించారు. ఈ రోజు ఉదయం 10.52కి దీనిని పరీక్షించినట్లు సంబంధిత అధికారులు చెప్పారు.

పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-2 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన కొద్దిరోజులకే ధనుష్ పరీక్ష కూడా విజయవంతం కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles