BJP Somu Veerraju attacks TDP and Chandrababu | ’సమన్యాయం-సమైక్యవాదం?.. చంద్రబాబుది పెద్ద మోసం‘

Somu veerraju comments on chandrababu

Somu Veerraju, BJP MLC, Press Meer, CM Chandrababu Naidu, Criticism, AP Special Status

BJP MLC Somu Veerraju Criticism on CM Chandrababu Over AP Special Status.

ITEMVIDEOS:చంద్రబాబుపై సోము వీర్రాజు ఆగ్రహం

Posted: 02/23/2018 04:06 PM IST
Somu veerraju comments on chandrababu

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు సమన్యాయం, మరోవైపు సమైక్యవాదం అంటూ చంద్రబాబు ఏపీ ప్రజలను తీవ్రంగా మోసం చేశారని, అసలు రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం ఆయనేనని విమర్శించారు. శుక్రవారం ఉదయం విజయవాడలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.

విభజనకు తాను అనుకూలమేనని కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖను చూపించి మరీ వీర్రాజు విమర్శలు గుప్పించారు. అప్పట్లో బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్నారే తప్ప, ఏపీలో ఒక్క ప్రజా ప్రతినిధి కూడా లేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ఏపీ విభజనకు ముందున్న పరిస్థితిని గుర్తు చేసిన ఆయన, "చంద్రబాబువి ఏంటీ డబుల్ స్టాండర్డ్స్? కానీ, మేము అప్పుడు విభజనపై ఓకే తాటిపై ఉన్నాం. ఆ సమయంలో మీరందరూ మమ్మల్ని కొట్టడానికి సిద్ధపడ్డారు. పత్రికా మిత్రులు అందరూ కూడా.. ఎవరయ్యా మీరు? మీకు ఏముంది ఇక్కడ? మీరు వచ్చి విడిపోదామంటారా? అంటూ పడ్డారు. మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయపడ్డాం. మాది వాస్తవాలను ఎప్పుడూ ఒప్పుకునే పార్టీ అని చెప్పారు.

ఏపీ ఏర్పడిన తరువాత హైదరాబాద్ లో రాయలసీమోళ్లే ముఖ్యమంత్రులు. హైదరాబాద్ నే అభివృద్ధి చేశామని చెబుతారు. వీరేమైనా ప్రస్తుత ఏపీలోని 13 జిల్లాల గురించి ఆలోచించారా? ఎప్పుడన్నా ఆలోచించారా? ఏమి కావాలో మీరు ఆవేళ అడిగారా? అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు . వెంకయ్యనాయుడుగారు ఆరోజు ఐదేళ్లు, పదేళ్లు కాదు... పదిహేనేళ్లు కావాలని అడిగారు. ఆయన అడిగిన తరువాతే వీళ్లంతా వచ్చారు. హోదాకు బదులు ప్యాకేజీ మూడు వేల కోట్లు చాలన్నారు. ఇప్పుడీ విధంగా ఎందుకు చేస్తున్నారు?" అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు బిల్లులో ఐదేళ్లని పెట్టారని గుర్తు చేస్తూ, నాడు ఐదేళ్ల స్థానంలో పదిహేనేళ్లని పెట్టించేందుకు టీడీపీ ఎటువంటి ప్రయత్నాలూ చేయలేదని దుయ్యబట్టారు.

వీర్రాజు.. జగన్ ఏజెంట్

బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు ఏజంట్‌గా మాట్లాడుతున్నాడని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. రాష్ట్రాన్ని పడగొట్టాలని భావించే వారికి వైఎస్ జగన్, సోము వీర్రాజులు సహకరిస్తున్నారని బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారికి మద్దతిస్తున్నారని వెంకన్న విమర్శలు గుప్పించారు.

ఏపీసీసీ ఆగ్రహం...

సోము వీర్రాజు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా తరుచూ మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోతూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు కోట్ల మంది కోరుకుంటోన్న ప్రత్యేక హోదాకు విరుద్ధంగా ఆయన మాట్లాడడం సరికాదని ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు. కారణాలేమైనా ఆంధ్రప్రదేశ్‌కు మోదీ సర్కారు చేస్తోన్న అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం గళం ఎత్తడం, ఎంపీలతో పార్లమెంటులో ఆందోళన చేయించడం మంచి పరిణామమే అని అన్నారు. కానీ, సోము వీర్రాజు మాత్రం కాకమ్మ కథలు చెబుతూ మభ్యపెట్టాలనుకుంటున్నారని అన్నారు.

సీపీఐ ఫైర్...

తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే... ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడమనేది ముమ్మాటికీ మోసమేనంటూ బీజేపీ నేతలపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. రాం మాధవ్ చెప్పినట్టు రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

ఇదే సందర్భంగా ఏపీ బీజేపీ మంత్రులపై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశానికి బీజేపీ చాలా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. భారతదేశ పటంలో ఏపీని లేకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే ఏపీ కేబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రులు ఇద్దరూ వైదొలగాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles