వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు పోలీసుల ముందు హాజరయ్యాడు. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా నిర్మాణం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులకు సంబంధించి శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా వర్మపై విచారణ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
విచారణ పూర్తయ్యాక బయటకు వచ్చిన వర్మ మీడియాతో నో కామెంట్ చేసి వెళ్లిపోయారు. మళ్లీ ఆయన సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారంట. నిజానికి ఆయన గతంలోనే ఆయన సీసీఎస్ ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే ఆ టైంలో షూటింగ్ లో ఉన్నానని చెప్పటంతో మరోసారి నోటీసులు పంపించారు. ఈ దఫా హాజరుకాకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించటంతో 17వ తేదీ(నేడు) హాజరయ్యారు.
ఐపీసీలోని 506తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, నిందితుడిగా రాంగోపాల్ వర్మ పేరు పొందుపరిచారు. సీఆర్పీసీ 41 ప్రకారం ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం ఐదుగురు అధికారులు మూడు గంటలపాటూ ఆయన్ని ప్రశ్నించారు. మొత్తం 24 ప్రశ్నలకు పోలీసులు వివరణ కోరినట్టు సమాచారం. ఈ రోజు విచారణ ముగిసిన వెంటనే మరో నోటీసును వర్మకు అందజేశారు. సోమవారం కూడా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఆయన మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను పోలీసులు సీజ్ చేశారు. వర్మకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎలాంటివారితో సంబంధాలు ఉన్నాయి తదితర అంశాలకు సంబంధించిన వివరాలు వీటిలో లభించే అవకాశం ఉన్నందున... పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
వర్మ ఎదుర్కొన్న కొన్ని ప్రశ్నలు...
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more