full-refund-on-tatkal-tickets-conditions-apply తత్కాల్ టిక్కెట్లకు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి..

Full refund on tatkal tickets conditions apply

tatkal booking, tatkal refund, tatkal tickets, tatkal tickets refund, Indian railway, 100 percent refund on tatkal ticket, railway news, news updates, latest updates, latest news, news online

The Railways sharing a good news with the passengers who often travel suddenly, as the ministry is planing to refund 100 percent to tatkal ticketers. But says conditions apply.

తత్కాల్ టిక్కెట్లకు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి..

Posted: 02/16/2018 02:29 PM IST
Full refund on tatkal tickets conditions apply

భారతీయ రైల్వేల్లో ప్రయాణించే ప్రయాణికులు ఇది శుభవార్త. మరీ ముఖ్యంగా అప్పటికప్పుడు అనుకుని తత్కాల్ లో టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణించే వారికి ఇది మరింత అనందాన్ని తెచ్చిపెడుతుంది. ఇటీవల లోకల్ సర్కిల్స్ అనే ఓ సంస్థ రైల్వేశాఖ తత్కాల్ టిక్కెట్లపై నిర్వహించిన ఓ సర్వేలో సుమారుగా 94శాతం మంది తత్కాల్ లో బుక్ చేసుకున్న టికెట్లను అరు గంటల ముందు రద్దు చేసుకున్న క్రమంలో తమ డబ్బులో సుమారు 50 శాతం మేరైనా వెనక్కి తిరిగివ్వాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే ఆ మేర ప్రజాభిప్రాయంపై నిర్ణయాన్ని తీసుకున్న రైల్వేశాఖ.. ఇక పనిలో పనిగా తత్కాల్ టికెట్లపై ఇక నూటికి నూరు శాతం డబ్బును కూడా వెనక్కిచ్చే అంశాన్ని కూడా తెరతీసింది. అయితే ఇలా నూటికి నూరు శాతం టికెట్ల డబ్బు వాపస్ రావాలంటే ప్రయాణికులకు కొన్న షరతులు వర్తించనున్నాయి, కొన్ని షరతులకు లోబడి తత్కాల్ టికెట్లపైనా పూర్తి రిఫండ్ ఇస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ-టికెట్లతో పాటు కౌంటర్ లో తీసుకున్న టికెట్లపైనా ఇది వర్తిస్తుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ఇక రైల్వేశాఖ తెలిపిన షరతులను ఏంటంటి..

* టికెట్ తీసుకున్న స్టేషన్ కు రైలు మూడు గంటలు అంతకుమించి ఆలస్యమైతే పూర్తి రిఫండ్ లభిస్తుందని తెలిపింది.
* ఆ స్టేషన్ కు రాకుండా రైలును మరో దారిలో మళ్లించినప్పుడు తత్కాల్ టికెట్ పై పూర్తి రిఫండ్ లభిస్తుంది.
* ప్రయాణికులు ఎక్కాల్సిన కోచ్ ను అధికారులు అనుసంధానించకున్నా కూడా రిఫండ్ లభిస్తుంది.
* ఏసీ క్లాసులో రిజర్వేషన్ చేయించుకుని, లోయర్ క్లాసులో టికెట్ కన్ఫర్మ్ అయి, ప్రయాణించడం ఇష్టం లేకున్నా కూడా పూర్తి రిఫండ్ లభిస్తుంది.
* ఒకవేళ లోయర్ క్లాసులో ప్రయాణించేందుకు అంగీకరించిన ప్రయాణికుడికి ఆ వ్యత్యాసాన్ని రైల్వే శాఖ వెనక్కు తిరిగి ఇచ్చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles