Veteran odia actress Parbati Ghosh passes away | సీనియర్ నటి, దర్శకురాలు కన్నుమూత

Actress parbati ghosh passes away

Union Petroleum, parbati ghosh, Odia, Dharmendra Pradhan, 'stree'. ,'laxmi', 'kaa', parbati ghosh,actress,ollywood,producer,odia cinema,bhubaneswar,illness,hospital

Veteran Odia cine actress, director and producer Parbati Ghosh passed away following prolonged illness early on Monday, family members said.

సీనియర్ నటి, దర్శకురాలు కన్నుమూత

Posted: 02/13/2018 12:37 PM IST
Actress parbati ghosh passes away

భారతీయ చలన చిత్ర రంగంలో మరో విషాదం అలుముకుంది. ఒరియా నటి, తొలి మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందిన పార్వతీ ఘోష్ (85) కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంత కాలంగా భాధపడుతున్న అమె.. భువనేశ్వర్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించిన కారణంగా కన్నుమూశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భువనేశ్వర్‌లోని ఆమె నివాసానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఆయన అమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

సినీ రంగం అభివృద్ధికి పార్వతి ఘోష్ చేసిన కృషిని గుర్తు చేసుకుని కొనియాడారు. ఒరియా సినీ రంగంలో తొలి మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందిన ఆమె అందరికీ ఆదర్శప్రాయులన్నారు. అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు వచ్చాక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు. మార్చి 28, 1933లో కటక్‌లో జన్మించిన పార్వతీ ఘోష్ 16 ఏళ్ల వయసులో ‘శ్రీ జగన్నాథ్’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో కాలుమోపారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానుల మనసుల్లో  సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parbati ghosh  actress  ollywood  producer  odia cinema  bhubaneswar  illness  hospital  

Other Articles