RRB Recruitment 2018 for 62907 Group D posts యువతరాన్ని పిలుస్తున్న రైల్వే.. గ్రూప్ డీ పోస్టుల భర్తీ..

Railways recruitment 2018 registration starts for 62907 group d posts

rrb recruitment 2018,rrb recruitment,railways recruitment board,rrb jobs,jobs news,indian railway,indian railway recruitment,jobs,jobs in 2018,jobs in railway,latest government jobs,railway jobs,northern railway jobs,railway jobs in 2018,jobs in february,railway jobs in february,62000 posts railway,,62907 railway,group d 62000 railway,railway apply for 62000 posts,railway group d

The wait of candidates awaiting a bumper recruitment is finally over as the Railway Recruitment Board has released a recruitment notification and has invited applications from eligible candidates for more than 62000 posts

యువతరాన్ని పిలుస్తున్న రైల్వే.. గ్రూప్ డీ పోస్టుల భర్తీ

Posted: 02/12/2018 06:39 PM IST
Railways recruitment 2018 registration starts for 62907 group d posts

రైల్వేశాఖలో కొలువుల జాతర కొలువుదీరనుంది. దేశవ్యాప్తంగా 62,907 గ్రూప్‌-డి పోస్టుల్లో చేరే అద్భుత  అవకాశాన్ని రైల్వేశాఖ యువతకు కల్పిస్తోంది. ఈ మొత్తం పోస్టుల్లో 6523 పోస్టులు కేవలం సికింద్రాబాద్‌ రైల్వ డివిజన్‌లో భర్తీ చేయనున్నారు. రైల్వేశాఖలోని గ్రూప్ డి పోస్టులకు 18 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసున్న యువకులు అర్హులుగా రైల్వే అధికారులు పేర్కొన్నారు,  పదోతరగతి/ ఐటీఐ/   నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ పొందినవారు ఈ  ఉద్యోగాలకు పోటీపడవచ్చు.

రైల్వేశాఖలో ప్రక్షాళనకు తెరతీసిన అధికారులు.. ఏకంగా 13 వేల పైచిలుకు మంది ఉద్యోగులు అనధికారికంగా దీర్ఘకాల సెలవులో కొనసాగుతన్న క్రమంలో వారిని తొలగించి వారి స్థానంలో యువరక్తాన్ని నింపేందుకు చర్యలు తీసుకుంది. ఈ ఉద్యోగాలు లభించిన యవతీయువకులకు రూ.18,000 నెల వేతనంతోపాటు ఎన్నో సౌకర్యాలు లభిస్తాయి. ఈ నియామక ప్రక్రియలో  కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత మార్కులు సాధించినవారికి శారీరక దార్ఢ్య పరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఇదీ పరీక్షా విధానం:
కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్షలో 100 ప్రశ్నలను పూర్తి చేయడానికి 90 నిమిషాల సమయాన్ని కేటాయించారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 40%, ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ వారు 30% కనీస అర్హత మార్కులు పొందాలి. అరిథ్‌మెటిక్‌, మేథమేటిక్స్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కరెంట్‌ అఫైర్స్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మైనస్ మార్కులు కూడా వుంటాయని అధికారులు తెలిపారు.

ఆన్ లైన్ లో దరఖాస్తు చేయడానికి ఆఖరు తేది: 12 మార్చి 2018

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rrb  recruitment  railways recruitment board  rrb jobs  group d posts  jobs  

Other Articles