Uma Bharati not to contest Lok Sabha polls కేంద్రమంత్రి ఉమా భారతి సంచలన నిర్ణయం..

Uma bharati not to contest elections due to age health related issues

Uma Bharati, union minister, bjp fire brand, lok sabha polls, jhansi, ill health, knee pain, back pain, uttat pradesh

Union minister Uma Bharati has announced not the contest in next Lok Sabha polls due to her ill health.

కేంద్రమంత్రి ఉమా భారతి సంచలన నిర్ణయం..

Posted: 02/12/2018 05:18 PM IST
Uma bharati not to contest elections due to age health related issues

బీజేపీ పార్టీ ఫైర్ బ్రాండ్, సీనియర్ నాయకురాలు, కేంద్రమంత్రి ఉమాభారతి ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో జరగబోవు ఏ ఎన్నికలలోనూ తాను పోటీ చేయబోనని అమె స్పష్టం చేశారు. దీంతో తాను జరగబోవు సార్వత్రిక ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు అమె చెప్పనకే చెప్పారు. అయితే బీజేపి పార్టీకి మాత్రం తన సేవలు కొనసాగిస్తానని అమె చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో అమె ఈ మేరకు తన నిర్ణయాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు.

కాగా, ఇప్పటికే చాలా మంది ప్రముఖుల నేతలకు గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపి దూరం పెట్టిన విషయం తెలిసిందే. దీంతో అలాంటి అవకాశం పార్టీ నేతలకు ఇవ్వకుండా ఉమాభారతి తనకు తానుగా నిర్ణయాన్ని తీసుకున్నారు. తనకు మంత్రివర్గంలో ప్రాధాన్యత తగ్గించారని విమర్శలు వస్తున్న క్రమంలో అమె ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారా..? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే సీనియర్ నేతల మాదిరిగానే ఉమాభారతి కూడా మోడీ సర్కారుపై విమర్శలు గుప్సిస్తారా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే అలాంటి ప్రశ్నలకు చెక్ పెట్టిన ఉమాభారతి.. కేవలం వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా ఎన్నికల్లో పోటీ చేయరాదని తాను నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. తాను రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేశానని, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పుకోచ్చారు. అయితే తన ఆరోగ్యం ప్రస్తుతం బాగోలేదని, అరోగ్యం సహకరించని కారణంగానే తాను రాబోవు ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని ఆమె అన్నారు. మోకాళ్లు, వెన్నునొప్పితో చాలా బాధపడుతున్నానని ఆమె తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles