Rahul slams RSS chief for 'disrespecting' Army ‘‘మిస్టర్ భగవత్, నీ వ్యాఖ్యలు సిగ్గుచేటు’’ రాహుల్ ట్విట్..

Rahul gandhi slams rss chief for disrespecting army

RSS chief mohan bhagwat, congress chief rahul gandhi, rahul demands rss apology, rahul gandhi demands mohan bhagwat apology, RSS, mohan bhagwat, rahul gandhi, Indian army, national flat, martyrs, rss, apology, twitter, social news, latest news

Congress President Rahul Gandhi slammed the RSS chief Mohan Bhagwat over his disrespectful statement against the Indian army and national flag, demanding apology.

‘‘మిస్టర్ భగవత్, నీ వ్యాఖ్యలు సిగ్గుచేటు’’ రాహుల్ ట్విట్..

Posted: 02/12/2018 12:47 PM IST
Rahul gandhi slams rss chief for disrespecting army

గత సార్వత్రిక ఎన్నికలలో భారత్ అర్మీ ఛాతి 56 అంగుళాలని ప్రధాని నరేంద్రమోడీ కీర్తించిన విషయాన్ని మర్చిపోయారో లేక తన సంఘ గురించి చర్చనీయాంశం కావాలనో, లేక స్థానిక యువత తమ వైపు అకర్షితులు కావాలనో కానీ గత కొన్నేళ్ల కిత్రం మారణహోమానికి దారితీసిన ప్రాంతంలో అర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మత ఘర్షణలతో గత కొన్నేళ్ల క్రితం రగిలిన ముజాఫర్ పూర్ లోని ఓ పాఠశాల అవరణలో మోహన్ భగవత్ తీవ్ర వ్యాఖ్యలను విపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దేశానికి ప్రాధాన్యత లేని సైన్యం ఎవరి కోసం..? ఎందుకోసం అంటూ నెట్ జనులు ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భగవత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. భారతదేశ ఆర్మీపై భగవత్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందిచిన ఆయన తక్షణం భారత దేశ అర్మీకి క్షమాఫణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భగవత్ వ్యాఖ్యలు సిగ్గు పడాలే వున్నాయని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగం ప్రతీ భారతీయుడ్ని అవమానించిందని దుయ్యబట్టారు. భరత జాతి కోసం ప్రాణాలు అర్పించిన స్వతంత్ర్య సమరయోధులను కించపర్చేలా భగవత్ ఎలా ప్రసంగిస్తారని ప్రశ్నించారు.

ప్రతీ జవాను వందనాన్ని అందుకునే భారత జాతీయ పతాకానికి భగవత్ వ్యాఖ్యలు అవమానకరమని, భారత పతాకా ఔనత్యాన్ని మసకబారేలా భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయని రాహుల్ గాంధీ అవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం సరిహద్దులో యముకలు కొరికే చలిలో విధులు నిర్వహిస్తున్న సైన్యాన్ని మోహన్ భగవత్ కించపర్చారని మండిపడ్డారు. దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరజవాన్లు త్యాగాలను అవమానపర్చారని అగ్రహం వ్యక్తం చేశారు. సమయం, సందర్భం వస్తే దేశం కోసం పోరాడేందుకు ఆర్మీని మూడు రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ సిద్ధం చేయగలదని.. అదే అర్మీ అయితే ఆరు నుంచి ఏడు నెలలు తీసుకుంటుందని మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RSS  mohan bhagwat  rahul gandhi  Indian army  national flat  martyrs  rss  apology  twitter  social news  latest news  

Other Articles