హైదరాబాద్ అంటే భాగ్యనగరం.. ఇక దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఓ రెండు పదుల ఏళ్ల క్రితం వరకు పచ్చని ప్రకృతితో అలరానిన ప్రాంతం. శరవేగంగా అభివృద్ది చెందుతూ ఇరవై ఏళ్లలోనే భాగ్యనగరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నగరీకరణ విస్లరించడం శుభపరిణామాం. అయితే నగరీకరణి నేపథ్యంలో మరీ ముఖ్యంగా నగరంలోని పలు మూలలను, ముఖ్య ప్రాంతాలను అనుసంధానం చేస్తూ అర్టీసీ రవాణా వ్యవస్థ వున్నా.. కిక్కిరిస జనాలకు తోడు గమ్యస్థానాలకు చేరేందుకు గంటల పాటు ప్రయాణం చేయాల్సి రావడంతో.. అవి వేగవంతమైన అభివృద్దిని అందుకోలేకపోతున్నాయి. దీంతో నగరంలో ప్రయాణానికి సొంత వాహనాలకే ఓటేస్తున్నారు నగరవాసులు. ఇలా నగరంలో లెక్కలేనన్ని వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి.
అయితే ఈ వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యం ఏకంగా భాగ్యనగరంలో పోగబారేట్లు చేస్తుంది. దీంతో నగరంలోని బాలానగర్, జీడిమెట్ల, పంజగుట్ట, ఉప్పల్, ప్యారడైజ్, జూబ్లీహిల్స్, నాంపల్లి, ఎంజీబీఎస్, చార్మినార్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఎల్బీనగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, మల్లాపూర్, నాచారం, అబిడ్స్, హెచ్‌సీయూ, గచ్చిబౌలి, మెహదీపట్నం, దిల్‌సుఖ్ నగర్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, బంజారాహిల్స్ ప్రాంతాలు ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. గత ఏఢాది సంతృప్తికరంగా వున్న పలు ప్రాంతాలు కూడా తాజా అద్యయానాల్లో ముప్పుబారిన చేరినట్లు ఇక మరికొన్ని ప్రాంతాలు విషతుల్యమైనట్లు కూడా సూచిస్తున్నాయి.
దీనికి ప్రధాన కారణం కేవలం నగరీకరణ నేపథ్యంలో పెరుగుతున్న వాహనాల కాలుష్యమే. భాగ్యనగరంలో వాహనాల వల్ల గాలిలో బెంజీన్, టోలిన్, అమ్మోనియా, నైట్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్‌లు పరిమితి మించిపోతున్నాయి. ప్రతి ఘనపు మీటరు గాలిలో 60 మైక్రో గ్రాములకు మించకుండా ఉండాల్సిన సూక్ష్మ, స్థూల ధూళి కణాల మోతాదు 100 మైక్రోగ్రాములకు చేరుకుంది. ఫలితంగా దేశంలోని వాయుకాలుష్య మెట్రో నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఢిల్లీ ఉండగా, తర్వాతి స్థానంలో ముంబై, కోల్‌కతాలు ఉన్నాయి. ఇక ఈ ప్రాంతాలకు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునేవారు వీలైనంత దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ ప్రాంతాల్లో అడుగుపెట్టడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.
హైదరాబాద్‌లో వాయుకాలుష్యాన్ని లెక్కించి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసేందుకు జీడిమెట్ల, పాశమైలారం, హెచ్‌సీయూ, జూపార్క్ వద్ద కంటిన్యూయస్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో నమోదయ్యే వాయుకాలుష్య నమూనాలను సేకరించి సనత్ నగర్‌లోని పీసీబీ కేంద్ర కార్యాలయంలోని ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు. ఈ ఫలితాలను ఎప్పుడో ఓసారి పరీక్షిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లోని కాలుష్యం ఎప్పుడు ఎంత ఉంటుందో తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. ఇతర మెట్రో నగరాల్లోని ప్రధాన కూడళ్లలో కాలుష్య మోతాదును పౌరులు తెలుసుకునేందుకు ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే యంత్రాలు ఉన్నాయి. వీటిని గ్రేటర్ పరిధిలోనూ ఏర్పాటు చేయాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 21 | తెలంగాణ అధికార పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తనయ.. షేక్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డీలు పరస్పరం బంజారాహీల్స్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసుకున్నారు. అదేంటి కేకే తనయ విజయలక్ష్మి... Read more
Jan 21 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలతో ఏకీభవించని న్యాయస్థాన ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలను బలపరుస్తూ రాష్ట్రంలో... Read more
Jan 21 | టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని, కేవలం విచారణకు మాత్రమే పిలిచామని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారీ తెలిపారు. రామతీర్థాన్ని టీడీపీ నేతలు సందర్శించిన రోజున జరిగిన ఘటనపై... Read more
Jan 21 | అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రెండో పర్యాయం బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ను గణనీయమైన ఓట్లతో ఓడించి.. ఆయన... Read more
Jan 21 | దేశ రాజధానిలో తన సత్తాను చాటిన అమ్ ఆద్మీ పార్టీ రెండో పర్యాయం కూడా అధికారంలోకి రాకముందే అటు పంజాబ్, ఇటు హర్యానా సహా పలు రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. పంజాబ్... Read more