Still sizeable gap between farm and fork: President వ్యవసాయరంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండు: రాష్ట్రపతి

Bring benefits of changes in food trade to farmers president ram nath kovind

farm income, Ram Nath Kovind, Agriculture sector, farm and fork, farmers, technology, president, sonepat, haryana

Emphasising that there is still a sizeable gap between farm and fork, President Ram Nath Kovind today said justice must be done with the growers to make their lives better.

వ్యవసాయరంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండు: రాష్ట్రపతి

Posted: 02/10/2018 06:43 PM IST
Bring benefits of changes in food trade to farmers president ram nath kovind

భారతదేశం వ్యవసాయాధారిత దేశమని, సుమారుగా 70శాతం మంది దీనిపైనే అధారపడి వున్నారని తెలిసినా.. ఈ రంగంలో నూతన ఉద్యోగావకాశాలను యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. వ్యవసాయ రంగ ఉత్పత్తులు సూపర్ మార్కెట్లకు అధిక సంఖ్యలో అందించడం ద్వారా ప్రపంచానికే ఆహారాన్ని అందించవచ్చని, తద్వారా మన దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని అన్నారు.

హర్యానాలోని సోనాపట్ లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ మేనేజ్ మెంట్ (ఎన్ఐఎఫ్ టీఈఎం) మొదటి స్నాతకోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ, ప్రపంచంలో అధిక శాతం పాలు ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఉందని అన్నారు. అదే విధంగా, వరి, కూరగాయలు, చెరకు, టీ, పండ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో, కోడిగుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానంలో, మాంసం ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఆరో స్థానంలో ఉందని అన్నారు.

భారత ఆహార, పచారీ సరుకుల ఉత్పత్తి చేసే దేశాల్లో ప్రపంచంలో ఆరో స్థానం మనదని, 2025 నాటికి ఒక ట్రిలియన్ యూఎస్ డాలర్లకు ఈ వ్యాపారం చేరనుందని, దేశానికి సంబంధించిన ఎగుమతుల్లో పదకొండు శాతం ఆహారఉత్పత్తులే ఉన్నాయని అన్నారు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశ్యంతో 42 మెగా ఫుడ్ పార్క్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farm income  Ram Nath Kovind  Agriculture sector  farm and fork  farmers  technology  president  sonepat  haryana  

Other Articles