indian railways action on absentee staff రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాల తొలగింపు..

Indian railways to take action against 13 000 absentee employees

Indian Railways, railway employees, Railways, rail staff, Piyush Goyal, Central Railways, Railways employment, railway staff

All the railway officers and supervisors have been instructed by Indian Railways to take out the employees on unauthorized absence from the employees’ rolls after following due process.

రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాల తొలగింపు..

Posted: 02/10/2018 12:01 PM IST
Indian railways to take action against 13 000 absentee employees

ఎన్నికలకు వెళ్లనున్నామన్న సంకేతాలను వెలువరించిన నేపథ్యంలో కేంద్రం నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కూడా కల్పించే దిశగా అగుడులు వేస్తుందని సమాచారం. ఈ క్రమంలో ముందుగా కేంద్ర పరిధిలోని ఉద్యోగులుగా చెలమణి అవుతూ.. ఉద్యోగ విధులకు మాత్రం గైర్హజరవుతున్న వారిపై చర్యలకు ఉపక్రమించింది కేంద్రం. కేంద్ర అదేశాలతో త్వరలో రైల్వే శాఖలో భారీగా ఉద్యోగుల కోత ఉండనుందని సమాచారం.

చాలాకాలం పాటు అనధికారిక సెలవులో ఉన్న ఉద్యోగులపై కేంద్ర రైల్వే శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వేశాఖ ఉద్యోగులుగా ప్రయోజనాలను అనుభవిస్తూ.. విధులకు మాత్రం హాజరుకాకుండా దీర్ఘకాలికంగా సెలవుల్లో వున్నావారు ఏకంగా 13వేల మంది ఉద్యోగులు వున్నారని గుర్తించిన రైల్వేశాఖ వారికి ఉద్వాసన పలికేందుకు చర్యలను చేపట్టింది. త్వరలోనే విధుల నుంచి తొలగించనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.

రైల్వే పనితీరును మెరుగుపరిచేందుకు, ఉద్యోగుల్లో నిబద్ధతను పెంచేందుకు ఇటీవల రైల్వేశాఖ ఓ డ్రైవ్‌ చేపట్టింది. ఇందులో భాగంగా చాలా కాలంగా సెలవులో ఉంటున్న సిబ్బంది వివరాలను సేకరించింది. ‘మొత్తం 13 లక్షల మంది ఉద్యోగుల్లో 13వేల మంది చాలా కాలం నుంచి అనధికారికంగా సెలవులో ఉంటున్నట్లు గుర్తించాం. వారిపై క్రమశిక్షణ చర్యలను ప్రారంభించాం. అలాంటి ఉద్యోగులను విధుల నుంచి తీసేయాలని భావిస్తున్నాం’ అని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఉద్యోగుల జాబితా నుంచి వీరి పేర్లను తొలగించాలని ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles