Arun Jaitley responds to TDP MPs protest ఏపీ విభజన హామీలన్నీ నెరవేరుస్తాం: రాజ్యసభలో జైట్లీ

Finance minister arun jaitley responds to tdp mps protest

tdp mps protest in rajya sabha, tdp mp protest in lok sabha, arun jaitley responds on ap mps protest, chandrababu, ap special status, ap special package, parliament, MPs, vishaka railway zone, congess, bjp, PM Modi, politics

Arun Jaitley said that Andhra Pradesh state finance minister has been called up in Delhi and the remaining formalities would be done accordingly. There are no difficulties in the allocation of funds, Arun Jaitley added.

ఏపీ విభజన హామీలన్నీ నెరవేరుస్తాం: రాజ్యసభలో జైట్లీ

Posted: 02/06/2018 04:25 PM IST
Finance minister arun jaitley responds to tdp mps protest

నవ్యాంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మరోమారు స్పష్టం చేశారు. క్రితం రోజు నుంచి టీడీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలను సాగనీయకుండా నినాదాలతో హోరెత్తించిన క్రమంలో స్పందించిన కేంద్రమంత్రి ఈ విషయమై ఇవాళ రాజ్యసభలో స్పందించారు. అంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాతో రావాల్సిన నిధులను ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఎలా ఇవ్వాలన్నదే ప్రధాన అంశమని,ఎక్స్ టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ (ఈఏపీ)ల ద్వారా ప్రత్యేక హోదా లోటును భర్తీ చేస్తామని అన్నారు.

ఈఏపీలపై జనవరి 3న అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారని, ఈఏపీలకు నాబార్డు ద్వారా నిధులు కేటాయించాలని బాబు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అయితే, ఈఏపీలకు నాబార్డు ద్వారా నిధులు ఇవ్వాలంటే సమస్య ఎదురవుతోందని, ఆవిధంగా నిధులిస్తే రాష్ట్ర రుణ సామర్థ్యం తగ్గుతుందని అన్నారు. దీంతో, ఈఏపీ నిధులు ఎలా ఇవ్వాలనే విషయమై చర్చిస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తున్నామని చెప్పారు. ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.3,990 కోట్లు చెల్లించామని ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

దీంతో త్వరలోనే అంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని, ఆర్థిక శాఖ కార్యదర్శులను హస్తినకు పిలిపించి వారికెలా నిధులను భర్తీ చేయగలుగాతమన్న విషయమై చర్చిస్తామని చెప్పారు. అ వెనువెంటనే కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ కూడా విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ అంశాన్ని కూడా అన్ని పార్టీల నేతలతో పాటు పక్కనున్న రాష్ట్రాల వినతులను కూడా పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో మరికొన్ని నెలల వ్యవధిలోనే ఈ సమస్యకు అధిగమిస్తామని చెప్పారు.  అయితే రైల్వే మంత్రి ప్రకటనపై టీడీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాగా, అంతకుముందు కేంద్రమంత్రి సుజనా చౌదరితో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. అంధ్రప్రదేశ్ ఎంపీలు అందోళనకు దిగి, ఉభయసభలను స్థంభింపచేయడంపై ఆయన అరా తీశారు. సుమారు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో అందోళన విషయాలను తెలుసుకున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయం, రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని కేంద్రమంత్రి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

కేంద్రమంత్రి సుజనా తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకున్న ప్రధాని.. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అన్ని అర్థిక సమస్యలు పరిష్కరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు, తక్షణం పార్లమెంటులో టీడీపీ పార్లమెంటు సభ్యులు చేపట్టిన ఆందోళనను విరమించాలని కోరినట్టు తెలుస్తోంది. ఆందోళన విరమించే అంశం తన చేతిలో లేదని మోదీతో సుజనా చెప్పారని సమాచారం. ఇందుకు, మోదీ స్పందిస్తూ, ఈ విషయమై చంద్రబాబుతో తానే స్వయంగా మాట్లాడతానని చెప్పినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles