Excise duty cuts have no effect on oil Prices మోడీ పాలనలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు

Petrol 81 in mumbai diesel at all time high in delhi

petrol, diesel, prices, oil ministry, PM Modi, excise duty, vat, business, India, news, companies, corporate, management, marketing, markets, advertising, finance, industry, retail price, diesel costs, Mumbai, Narendra Modi, government, sales tax, VAT rates

The retail price of petrol shot up by 15 paise to Rs81.17 a litre in Mumbai – the highest since the Narendra Modi government assumed power and the price of diesel in Mumbai was Rs68.30 per litre, 7 paise more than previous day

మోడీ పాలనలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు

Posted: 02/06/2018 09:55 AM IST
Petrol 81 in mumbai diesel at all time high in delhi

నాలుగేళ్లు ముందు ఏ ధరఘాతాన్ని బీజేపి మెండుగా ప్రచారం చేసుకుని ఏ వస్తువైనా రూ.80 ధర పలకాల్సిందేనని సోషల్ మీడియా వేదకగా ప్రచారం చేసి.. ప్రతీ భారతీయుడ్ని తమ వైపు అకర్షించిందో అదే ధరాఘాతం ఇప్పడు కేంద్రంలోని నరేంద్ర మోదీ  ప్రభుత్వానికి కూడా శరాఘాతంలా తయారైంది. అటు నిత్యాతవసర సరుకుల ధరలు అకాశాన్ని అంటగా, ఇటు ఇంధన ధరలు కూడా భగభగమండుతున్నాయి. వాహనదారులు కేంద్రంలోని ప్రభుత్వ నిర్ణయాలపై మండిపడేలా చేస్తున్నాయి.

అందుకు కారణం ఏకంగా నాలుగేళ్ల గరిష్ట స్థాయికి ఇంధన ధరలు చేరుకోవడమే. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తృత్వంలో ఎన్డీయే సర్కారు గద్దెనెక్కాక, పెట్రోలు ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ఇప్పుడు రూ. 78 నుంచి రూ. 81కి పైగా ఉంది. సోమవారం నాడు లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజెల్ పై 7 పైసల మేరకు ధర పెరిగింది. దీంతో ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 81.17గా నమోదైంది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వేళ, లీటరు పెట్రోలు ధర రూ. 72గా ఉంటే ఇప్పుడది 80 దాటేసింది. గడచిన నెల రోజుల వ్యవధిలోనే పెట్రోలు ధర 4 రూపాయలకు పైగా పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారల్ కు 132 డాలర్ల వద్ద ఉన్న సమయంలోనూ, పెట్రోలు ధర రూ. 70 నుంచి రూ. 75 మధ్యే ఉండగా, ఆ స్థాయితో పోలిస్తే, ప్రస్తుతం క్రూడాయిల్ ధర 60 డాలర్లకన్నా దిగువనే ఉన్నప్పటికీ, పెట్రో ఉత్పత్తుల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న వేళ, పన్నులను పెంచుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖజానాను నింపుకునేందుకే చూశాయని, ఇప్పుడు ధరలు పెరుగుతుంటే మాత్రం పన్నులను సవరించడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  diesel  prices  oil ministry  PM Modi  excise duty  vat  business  

Other Articles