Ramdev expresses discontent over IT relief అరుణ్ జైట్టీ బడ్జెట్ పై బాబా రాందేవ్ పెదవివిరుపు

Ramdev expresses discontent over income tax relief for salaried class

Arun Jaitley, PM Modi, Union Budget 2018, IT slabs, salaried class, Baba Ramdev

Yoga Guru Baba Ramdev praised the budget presented by FM Arun Jaitley, however he said that it would have been better had people been provided relief in Income Tax up to a limit of Rs 5 lakh.

అరుణ్ జైట్టీ బడ్జెట్ పై బాబా రాందేవ్ పెదవివిరుపు

Posted: 02/02/2018 10:11 AM IST
Ramdev expresses discontent over income tax relief for salaried class

ఈ ఏడాది చివర్లోనే ముందస్తుగా సార్వత్రిక ఎన్నికలకు వెళ్తామని సంకేతాలను ఇచ్చిన తరుణంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే విపక్షాలు ఈ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ అని, చెప్పింది బారెడు కానీ చేసింది మాత్రం మూరడేనని విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఇన్నాళ్లు బీజేపి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన బాబా రాందేవ్ కూడా బడ్జెట్ పై మాత్రం పెదవివిరిచారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలను తమవైపుకు అకర్షించడంలో విఫలమైందని ఆయన నిరాశను వ్యక్తం చేశారు. రైతు బడ్జెట్, పేదల బడ్జెట్ అని అటు కేంద్రమంత్రులతో పాటు సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీ డాంభికాలకు పోతున్నా.. ఠంచనుగా పన్నులు కట్టే మధ్యతరగతి ప్రజలకు, వేతన జీవులకు మాత్రం ఈ బడ్జెట్ తో ఒరిగిందేమీ లేదని అన్నారు. సరిగ్గా ఎన్నికల తరుణంలో వచ్చిన బడ్జెట్ పై అన్ని వర్గాల ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారని అయితే వారిని సంతృప్తి పర్చడంలో అర్థిక మంత్రి జైట్లీ విఫలమయ్యారని విమర్శించారు.

సామాన్యులకు ఆదాయపు పన్ను మినహాయింపు లేదని, దానిపై పరిమితి రూ.5 లక్షలకు పెంచితే బాగుండేదని బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని, తద్వారా సగటు పన్ను చెల్లింపుదారులకు ఊరట లభిస్తుందని చాలా మంది ప్రజలు భావించారని అన్నారు. పన్నులు చెల్లించే వారి సంఖ్య 50 శాతం, వారికి ఫలాలను అందించకపోవడంతో వారు నిరాశ చెందారని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించి, త్వరలోనే ఓ నిర్ణయం ప్రకటిస్తుందని భావిస్తున్నానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitley  PM Modi  Union Budget 2018  IT slabs  salaried class  Baba Ramdev  

Other Articles