Mobile Phones, Watches, Pan Masala to Cost More సెల్ ఫోన్లు, టీవీలు, పాన్ మసాలా ప్రియం.. ఇంధనంపై పన్ను కుదింపు

Mobile phones sunglasses watches pan masala to cost more

arun jaitley, budget, mobile phones, ciggerte ligher, sun glasses, petrol, dissel, smart watches, olive oil, video games, cashew, tooth pase, health, health cover for every citizen, health budget, education, education budget, budget education, Budget 2018, Budget 2018 Live, Budget session, income tax, lok sabha, Narendra Modi, parliament, rajya sabha, Union Budget, Union Budget 2018, Union Budget 2018-19

The Union Budget, as presented by Finance Minister Arun Jaitley, reduced basic excise duty on branded and unbranded petrol as well as diesel.

సెల్ ఫోన్లు, టీవీలు, టూత్ పేస్ట్, పాన్ మసాలా ప్రియం.. ఇంధనంపై పన్ను కుదింపు

Posted: 02/01/2018 02:38 PM IST
Mobile phones sunglasses watches pan masala to cost more

కేంద్ర బడ్జెట్ పై అన్ని వర్గాలు ఎంతో అశలు పెట్టుకోగా.. వాటిలో ఏ ఒక్కవర్గానికి కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ పూర్తి న్యాయం చేసే దిశగా అడుగులు వేయలేదన్న విమర్శలు వినబడుతున్నాయి. దేశంలోని అన్ని వర్గాలప్రజలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావాన్ని చూపుతున్న ఇంధన ధరలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలను సంతృప్తి పర్చడం లేదు. కేంద్ర అర్థిక బడ్జెట్ కు ముందు గత కొన్నాళ్లుగా స్వయంగా కేంద్ర ఇంధన శాఖ మంత్రి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తారన్న అంచానాలన్నీ బడ్జెట్ పటాపంచలు చేసింది.

పెట్రోల్ డీజిల్ ధరలు గణనీయంగా తగ్గుతాయని అశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. అయితే కేంద్రం మాత్రం కంటితుడుపు చర్యగా కేవలం రెండు రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. అయితే కేవలం ఇంధనాన్ని మాత్రమే 23 లేదా 29 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే.. గణనీయంగా ధరలు తగ్గుతాయని అశించిన వాహనదారుల అశలు అడియాశలయ్యాయి. డీజిల్ ధర ఏకంగా దేశంలోని అన్ని రావాణా సంస్థలపై ప్రభావం చూపుతూ సరుకుల ధరలపై కూడా ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. గత నెల రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలకు ఇప్పట్లో తగ్గే మోక్షం లేనట్లే కనిపిస్తుంది.

ఇదే సమయంలో సామాన్యుల నుంచి ఉన్నతవర్గాల ప్రజల వరకు అందరూ వినియోగించే టూత్ పేస్ట్ పై ధరను పెంచింది కేంద్రం. దీంతో పాటు మధ్యతరగతి ప్రజలపై భారం మోపేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్లు, బైకుల స్పేర్ పార్టులు కూడా ప్రియం కానున్నాయి. చేతి గడియాలు, సన్ గ్లాసెస్, వీడియో గేమ్స్, టీవీలు, సెల్ ఫోన్లు, అహార ధాన్యాల ధరలకు కూడా రెక్కలు రానున్నాయి. కేవలం డీజిల్, పెట్రోల్ లపై రెండు రూపాయల ఎక్సైజ్ పన్నును కుదించడంతో పాటు సంపన్నవర్గాలు తినే క్యాష్యూ పై ధరను తగ్గించింది.

ధరలు పెరిగే ఉత్పత్తులు/ సేవల జాబితా

* కార్లు,  మోటార్ సైకిళ్ళు
* మొబైల్ ఫోన్లు
* వెండి
* బంగారం
* సన్‌ స్క్రీన్‌
* పాదరక్షలు
* కూరగాయలు పండ్ల రసాలు
* సన్ గ్లాసెస్
* సోయా ప్రోటీన్ కాని ఇతర ఆహార పదార్థాలు
* పెర్ఫ్యూమ్స్ మరియు టాయిలెట్ వాటర్
* రంగు రత్నాలు
* వజ్రాలు
* ఇమిటేషన్‌ జ్యుయల్లరీ
* స్మార్ట్ గడియారాలు / ధరించగలిగిన పరికరాలు
*ఎల్‌సీడీ/ఎల్‌ఈడీ టీవీ ప్యానెల్లు
* దంత ఉత్పత్తులు,
* సిల్క్ ఫాబ్రిక్స్
* ఫర్నిచర్
* పరుపులు
* లాంప్స్
* అన్ని రకాల గడియారాలు
* ట్రైసైకిల్, స్కూటర్లు, పెడల్ కార్లు, చక్రాల బొమ్మలు, 
* వీడియో గేమ్ కన్సోల్లు
* స్పోర్ట్స్ లేదా అవుట్డోర్ క్రీడలు,  స్విమ్మింగ్‌ పూల్‌ సామగ్రి
* సిగరెట్ , లైటర్లు, కొవ్వొత్తులు
* కైట్స్
* వంట నూనెలు: ఆలివ్ నూనె, వేరుశనగ నూనె / ఇతర కూరగాయల నూనెలు

 ధర తగ్గే ఉత్పత్తులు / సేవల జాబితా

* జీడిపప్పు
* ముడి పదార్థాలు, కాంక్లియర్‌ ఇంప్లాంట్స్ తయారీలో ఉపయోగించే భాగాలు ,  ఉపకరణాలు
* సోలార్ ప్యానెల్స్ / మాడ్యూల్స్ కోసం ఉపయోగించే సౌర స్వభావిత గాజు
*  కొన్ని క్యాపిటల్‌ గూడ్స్‌, ఎలక్ట్రానిక్‌ ఉత్పతులు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arun jaitley  Union Budget 2018  income tax  petrol  diesel  excise duty  Narendra Modi  parliament  

Other Articles