YSRCP Leader Subramaniam Reddy Joins TDP టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నేత

Ysrcp leader subramaniam reddy joins tdp

ycp subramaniam reddy,ycp subramaniam reddy joins tdp,subramaniam reddy,subramaniam reddy joins tdp,subramaniam reddy joined tdp,ycp leader joined tdp,party migrations,cm chandrababu naidu,ycp subramaniam reddy meets chandrababu,ycp leaders join tdp,party defections,party defections in ycp,party migrations in ap,ycp party defections,ys jagan,tdp vs ycp,subramaniam on ys jagan, Subramaniam Reddy, TDP, Chandrababu, YSRCP, Andhra Pradesh, Politics

Former ZPTC Chairman and YSRCP senior leader Subramaniam Reddy joined TDP along with many party followers in the presence of Chief Minister Chandrababu.

ITEMVIDEOS: టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నేత సుబ్రహ్మణ్యం రెడ్డి

Posted: 01/30/2018 05:56 PM IST
Ysrcp leader subramaniam reddy joins tdp

వైసీసీ అధినేత జగన్ ఓ వైపు ప్రజాసంకల్ప యాత్రతో ప్రజల్లోకి వెళ్లి.. ప్రజలను అకర్షిస్తున్న తరుణంలో.. టీడీపీ మాత్రం వైసీపీ నేతలకు గాలం వేస్తుంది. తాజాగా నెల్లూరు జిల్లాలో జగన్ వెయి కిలోమీటర్ల యాత్రను పూర్తి చేసిన సందర్భంగా ఓ స్థూపాన్ని అవిష్కరించగా, టీడీపీ మాత్రం జడ్పీ మాజీ ఛైర్మన్‌ ఎం.సుబ్రహ్మణ్యంరెడ్డి తమ గూటికి చేర్చుకుంది. సోమవారం విజయవాడ సమీపంలోని ఉండవల్లిలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో సుబ్రహ్మణ్యంరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

తమ అనుచరగణంతో టీడీపీలో చేరిన సుబ్రహ్మణ్యం రెడ్డిని చంద్రబాబు పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి అహ్వానించారు. ఆయనతోపాటు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి మద్దతుదారులు, అభిమానులు టీడీపీ చేరారు. ఇందుకోసం టీడీపీ ముఖ్యనాయకులు విజయవాడకు చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ గడచిన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను కుప్పం ప్రజలకు సేవలను అందించాలన్న లక్ష్యంతో పని చేశానన్నారు.

స్థానిక టీడీపీ నాయకుల అభీష్టం మేరకు తాను టీడీపీ పార్టీలో చేరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఎదురైన అనేక సమస్యలను అధిగమిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. తమ పార్టీ చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో ప్రతిపక్షాలకు చెందిన నేతలు తమ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అమరనాథరెడ్డితో పాటు శాసనమండలి సభ్యుడు గౌనివారి శ్రీనివాసులు, సీడీసీఎంఎస్‌ ఛైర్మన్‌ నడింపల్లె శ్యామరాజు తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subramaniam Reddy  TDP  Chief Minister  Chandrababu  YSRCP  Andhra Pradesh  Politics  

Other Articles