Lalu Yadav convicted in third fodder scam మూడోస్సారి దోషిగా తేలిన లాలూ.!

Rjd supremo lalu prasad yadav convicted in third fodder scam

fodder scam, lalu prasad yadav, fodder scam verdict, verdict in third fodder scam, lalu and fodder scam, chaibasa treasury fodder scam, jagannath mishra, cbi

RJD supremo Lalu Prasad Yadav was today convicted by a special CBI court in Ranchi in another fodder scam case.

మరో దాణా కుంభకోణంలో దోషిగా లాలూ..

Posted: 01/24/2018 12:46 PM IST
Rjd supremo lalu prasad yadav convicted in third fodder scam

దాణా కుంభకోణంలో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మూడోస్సారి కూడా దోషిగా తేలారు. ఈ మేరకు లాలూపై మోపబడిన అభియోగాలను విచారించిన రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ మేరకు దోషిగా తేల్చింది. బీహార్ సహా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంపై దాఖలైన పలు కేసులను విచారించిన న్యాయస్థానం ఇప్పటికే రెండు కేసులకు సంబందించి ఆయనను దోషిగా తేల్చి శిక్షను కూడా వెలువరించింది.

ఈ నేపథ్యంలో ధాఖలైన చైబాస ట్రెజరీ దాణా స్కామ్ కేసులోనూ లాలూ ప్రసాద్ యాదవ్ ను ఇవాళ మూడోస్సారి దోషిగా తేల్చింది. ఇదివరకే రెండు కేసులకు సంబంధించి లాలూను సీబిఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్థారించిందింది. న్యాయస్థానం శిక్షలను కూడా ఖారారు చేయడంతో ప్రస్తుతం అయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఇక తాజా కేసుకు సంబంధించి కూడా ఆయన దోషిగా తేలారు.

కాగా ఈ మూడో కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాలకు చెరో ఐదేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. దీంతోపాటు చెరో రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో మొత్తం 76 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో విచారణ సమయంలో 14 మంది చనిపోయారు. ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. ఇద్దరికి శిక్ష పడగా, ఒకరు పరారీలో ఉన్నారు. విచారణ ఎదుర్కొన్న మిగిలిన 56 మందిలో ఆరుగులు రాజకీయ నేతలు, ముగ్గురు మాజీ ఐఏఎస్ అధికారులు, ఆరుగురు పశుసంవర్ధక శాఖ అధికారులు, ఒక ట్రెజరీ అధికారి, 40 మంది దాణా సరఫరాదారులు ఉన్నారు.

బిహార్ రాష్ట్రంలో1990 తర్వాత చోటు చేసుకున్న దాణా స్కామ్ పై పలు కేసులను సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. 1992-93లో చై బాసా ట్రెజరీ నుంచి అక్రమంగా రూ.33.67 కోట్లను డ్రా చేసినందుకు బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాను కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. దీనిపై ఎగువ కోర్టులో సవాలు చేయనున్నట్టు ఆర్జేడీ ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం లాలూ రాంచిలోని బిస్రాముండా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fodder scam  lalu prasad yadav  chaibasa treasury fodder scam  jagannath mishra  cbi  

Other Articles