SpiceJet's 'Great Republic Day Sale' Bumper Offer స్పైస్ జెట్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ బంఫర్ అఫర్

Spicejet celebrates republic day with new offer now fly at rs 769

spicejet, spicejet sale, spicejet great republic day sale, spicejet republic day sale, SpiceJet, SpiceJet Republic Day sale, Republic Day sale, Spicejet sale on airline tickets, Spicejet sale on airline routes, Republic Day sale offer on Spicejet

The low cost airline launched the great republicday sale, which will continue till Thursday. During the 4-day sale, customers can book tickets for travel on any date up to December 2018.

స్పైస్ జెట్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ బంఫర్ అఫర్

Posted: 01/23/2018 11:28 AM IST
Spicejet celebrates republic day with new offer now fly at rs 769

జాతీయ పండుగైనా లేక అంతర్జాతీయ గుర్తింపు దినోత్సవమైనా.. వాతావరణ మార్పులతో వచ్చే కాలాలైనా.. లేక ప్రాంతీయ పండుగలైనా కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్లు మారిపోయింది విమానయాన రంగం. సీటు అక్యూపెన్సీతో పాటు లాభాల అర్జనకు సిద్దమవుతున్న విమానయాన సంస్థలు అందుబాటు ధరల్లో అఫర్లను ప్రకటించి మరీ కస్టమర్లను అకర్షిస్తున్నారు. ఇప్పటికే న్యూఇయర్ సేల్ పేరుతో పలు విమానయాన సంస్థలు అమ్మకాలను జరపిన విషయం పాఠకులకు తెలిసిందే.

కొత్త ఏడాది పోటీలోనూ తాను వున్నానని అపర్ ను ప్రకటించిన ప్రముఖ విమానయాన సంస్థ.. బడ్జెట్ క్యారియర్ గా పేరొందిన స్పైస్ జెట్.. తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. పరిమిత కాలముండే ప్రమోషనల్‌ ఆఫర్‌ ను ‘గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌’గా పేర్కొంది. ఈ ఆఫర్ లో ప్రయాణికులు దేశీయంగా ఒకవైపు మాత్రమే ప్రయాణించేందుకు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 769 రూపాయల ప్రారంభ ధరతో టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

అదే విధంగా విదేశీ వన్‌ వే ప్రయాణానికి 2,469 రూపాయల ప్రారంభ ధరతో టికెట్లను కొనుగోలు చేయవచ్చని స్పైస్ జెట్ ప్రకటించింది. ఈ ఆఫర్ జనవరి 25 వరకు అందుబాటులో ఉంటుందని స్పైస్ జెట్ ప్రకటించింది. ఈ ఆఫర్‌ లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్నవారు ఈ ఏడాది డిసెంబర్‌ 12లోపు ఎప్పుడైనా ప్రయాణించవచ్చని ప్రకటించింది. స్పైస్ జెట్ మొత్తంగా నడిపిస్తున్న దేశీయ, విదేశీ రూట్లలో ఈ అఫర్ వర్తింపజేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SpiceJet  Republic Day sale  Spicejet air tickets  Spicejet airline routes  bumper offer  

Other Articles