bank apps including SBI, HDFC, Axis in danger 232 బ్యాంకు యాప్ లకు ముప్పు..

Banks warn of new mobile malware 232 banking apps in danger

Android malware,mobile app,Indian public,private banks,malware targets banks,cryptocurrency apps,Bitcoin app,Android Banking Trojan,Flash Player,Adobe Flash Player,232 banking apps,Android mobile phone,third party app stores,Google Play,Android OS,Google

In a report published on Quickheal Security Labs, the malware can affect as many as 232 banking as well as cryptocurrency apps world over including SBI, HDFC, Axis.

ఎస్బీఐ, యాక్సిస్ సహా 232 బ్యాంకు యాప్ లకు ముప్పు..

Posted: 01/11/2018 08:59 PM IST
Banks warn of new mobile malware 232 banking apps in danger

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో అన్ని ఫింగర్ టిప్స్ వద్దే లభిస్తున్నాయని ఇన్నాళ్లు సంతోషపడిన వారికి ఇదోక షాకింగ్ న్యూస్. మీ మొబైల్ ఫోన్ లో మీ బ్యాంకు యాప్ కనకవుటే తక్షణం అప్రమత్తం కావాల్సిన అవసరముంది. బ్యాంకు యాప్ అప్లికేషన్లకు సెక్యూరిటీ ముప్పు ఉందంటూ వార్తలు రావడంతో ఖాతాదారులకు కూడా అందోళనకు గురవుతున్నారు. ఇక బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు హెచ్చరిక సందేశాలు పంపిస్తుండటంతో ఈ అందోళన మరింత పెరిగింది.

మొబైల్ బ్యాంకింగ్ ను సురక్షిత విధానాల్లో నిర్వహించాలని బ్యాంకులు తమ కస్టమర్లకు సూచిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 232 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందిన ఆండ్రాయిడ్ యాప్స్ ను ట్రోజన్ మాల్వేర్ లక్ష్యంగా చేసుకున్నట్టు సైబర్ భద్రతా ఉత్పత్తుల సంస్థ క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ గుర్తించింది. దీంతో బ్యాంకులు మాల్వేర్ పై హెచ్చరిస్తూ తమ ఖాతాదారులకు సందేశాలు పంపిస్తున్నాయి.

ఆండ్రాయిడ్ బ్యాంకర్ ఏ9480 పేరుతో పిలిచే ఈ మాల్వేర్ ను కస్టమర్ల లాగిన్ వివరాలు కొట్టేయడానికి, వారి మొబైల్ కు వచ్చే ఎస్ఎంఎస్ లను హైజాక్ చేసేందుకు, నకిలీ నోటిఫికేషన్లు పంపేందుకు వీలుగా డిజైన్ చేసినట్టు యాంటీ వైరస్, సెక్యూరిటీ, యాంటీ స్పైవేర్ సంస్థ క్విక్ హీల్ గుర్తించింది. నకిలీ ఫ్లాష్ ప్లేయర్ యాప్ ద్వారా ఈ మాల్వేర్ చొరబడుతున్నట్టు తేలింది. క్విక్ హీల్ తన జాబితాలో భారత బ్యాంకుల యాప్స్ లను కూడా పేర్కోంది.

క్విక్ హీల్ జాబితాలో యాక్సిస్ మొబైల్, హెచ్ డీఎఫ్ సీ మొబైల్ బ్యాంకింగ్, ఎస్ బీఐ ఫ్రీడమ్ ప్లస్(ఎస్ బీఐ ఎనీవేర్), హెచ్ డీఎఫ్ సీ క్విక్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఐ మొబైల్, ఐడీబీఐ బ్యాంక్ గో మొబైల్ ప్లస్, ఐడీబీఐ బ్యాంకు అభయ్, ఐడీబీఐ బ్యాంక్ గో మొబైల్, ఐడీబీఐ ఎంపాస్ బుక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎం పాస్ బుక్, యూనియన్ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్, యూనియన్ బ్యాంకు కమర్షియల్ క్లయింట్స్ యాప్ ఉన్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Android malware  mobile app  Indian public  private banks  malware targets banks  apps  Bitcoin app  

Other Articles