atrocity case filed against bandla ganesh టాలీవుడ్ నిర్మాతపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు

Atrocity case filed against tollywood producer

sc st atrocity case on bandla ganesh, sc st atrocity case bandla shivababu, sc st atrocity case tollywood producer, sc st atrocity case on producer bandla ganesh, Bandla Ganesh, sc st atrocity case, Tollywood producer, tollywood, shadnagar, rangareddy, telangana, crime

In a land dealing issue a problem araised between purchaser and seller evolved into atrocity case against tollywood producer bandla ganesh.

టాలీవుడ్ నిర్మాతపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు

Posted: 01/11/2018 11:12 AM IST
Atrocity case filed against tollywood producer

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్, అతని సోదరుడు శివబాబులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. నగర శివార్లలో భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన అంశలో బండ్ల గణేష్ తన భూవిక్రేతల పట్ల అసభ్య పదజాలాన్ని వినియోగించి.. అమర్యాదగా వ్యవహరించడంతో పాటు కులంపేరుతో దూషించిన నేపథ్యంలో ఈ కేసును రిజిస్టర్ చేశామని ఏసీపీ సురేందర్ స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఏసీపి కథనం ప్రకారం ఇలావున్నాయి.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన డాక్టర్ దిలీప్ చంద్రకు ఫరూఖ్ నగర్ మండలం, బూర్గుల శివారులో పౌల్ట్రీ ఫామ్ లు, భూములు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు బండ్ల గణేష్ గతంలో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ ఆస్తులపై ఉన్న బ్యాంకు రుణాలను చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే, నిర్ణీత సమయంలోగా రుణాలను చెల్లించకపోవడంతో... ఈ ఆస్తులను, దిలీప్ చంద్ర ఇంటిని బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఈ ఆస్తులను వారి ద్వారానే విక్రయించారు.

అయితే, తనకు రావాల్సిన డబ్బుల కోసం దిలీప్ చంద్ర, ఆయన భార్య, కౌన్సిలర్ కృష్ణవేణితో కలసి బూర్గుల శివారులో గల గణేష్ పౌల్ట్రీ ఫామ్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా తమను గణేష్, అతని సోదరుడు శివబాబు కులం పేరుతో దూషించారంటూ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, బండ్ల గణేష్ సోదరులపై అట్రాసిటీ కేసు నమోదైంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bandla Ganesh  sc st atrocity case  Tollywood producer  tollywood  shadnagar  rangareddy  telangana  crime  

Other Articles