Rajasthan minister jaswant yadav controversial remarks రాజస్థాన్ మంత్రి జస్వంత్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Hindus vote for me muslim vote for congress says rajasthan minister

muslim, Congress, Rajasthan, Narendra Modi, Lok Sabha, Jaswant Yadav, BJP, alwar lok sabha by polls, hindus, social media, viral video

A video clip of Rajasthan cabinet minister Jaswant Yadav, the BJP candidate for the Alwar Lok Sabha bypoll, purportedly asking Hindus to vote for BJP and Muslims for Congress has gone viral on social media

రాజస్థాన్ మంత్రి జస్వంత్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Posted: 01/10/2018 07:24 PM IST
Hindus vote for me muslim vote for congress says rajasthan minister

ప్రతిపక్షంలోని నేతలు ఏ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై వెనువెంటనే చర్యలు తీసుకునే అధికారులు.. అదే అధికార పక్షంలోని సభ్యులు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవడమే కాదు.. కనీసం వినిపించుకున్న పాపన కూడా పోవడంలేదు. సరిగ్గా ఎన్నికల సమయంలోనే ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా విభజనలు చేసి మరీ కామెంట్లు చేసినా అడిగే నాధుడే కరువయ్యాడు.

ఇప్పుడీ విషయం ఎందుకంటే.. తాజాగా రాజస్థాన్ మంత్రి జస్వంత్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అందరినీ అలోచింపజేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, ఉపాధి ఇలాంటి వాటిలో ప్రభుత్వంలోని వ్యక్తి ఎలా వ్యవహరిస్తున్నారన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఈ విషయాన్ని పక్కనబెడితే అమాత్యుల వారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటో తెలుసా.? అయితే అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో కూడా తెలుసుకోవాలి.

రాజస్థాన్ లోని అల్వార్‌ లోక్ సభకు త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థిగా మంత్రి జస్వంత్ యాదవ్.. ఓటర్లు హిందువైతే తనకు, ముస్లింలు అయితే కాంగ్రెస్ కు ఓటు వేయాలన్నారు. అల్వార్ నియోజకవర్గంలోని దుఘేడా గ్రామంలో ప్రచారంలో పాల్గొంటూ మంత్రి జస్వంత్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

జస్వంత్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అటు హిందువులు, ఇటు ముస్లింలతో పాటు అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లివిరుస్తున్నాయి. ఇక తమ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బిజేపీ అధిష్టానం.. ఇదంతా ప్రతిపక్షాల కుట్రగా పేర్కోంది. ఈ వీడియో కూడా కాంగ్రెస్‌ సృష్టేనని తిప్పికోట్టే ప్రయత్నాలు చేసింది. తమ అభ్యర్థి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించారని ఆరోపిస్తుంది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : muslim  Congress  Rajasthan  Narendra Modi  Lok Sabha  Jaswant Yadav  BJP  alwar lok sabha by polls  

Other Articles