Mid-air fight in cockpit; Two Jet Airways pilots fired గాల్లో విమానం.. కొట్టుకున్న ఫైలెట్లు.. ప్రయాణికులు షాక్

Mid air fight in cockpit two jet airways pilots fired

cockpitfight, pilots fight, midair fight, Jet Airways, London-Mumbai flight, New Year’s Day, termination, mid-air ruckus, Directorate General of Civil Aviation (DGCA), Pilots, crew, fighting, dismissal, termination

Two senior pilots- a man and woman-engaged in a fight inside the cockpit of the Jet Airways London-Mumbai flight on New Year's Day were terminated by the airlines.

గాల్లో విమానం.. కొట్టుకున్న ఫైలెట్లు.. ప్రయాణికులు షాక్

Posted: 01/10/2018 08:39 AM IST
Mid air fight in cockpit two jet airways pilots fired

ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత తమ భుజస్కంధాలపై వున్నా.. దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా.. గాల్లో విమానం వుండగా, కాక్ పిట్ లో ఇద్దరు సీనియర్ పైలెట్లు కొట్టుకున్న విషయం వెలుగుచూసింది. దీంతో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. ఇక ఫైటింగ్ తో కలకలం రేపిన ఇద్దరు పైలెట్లకు జెట్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థ కూడా షాకిచ్చింది. ఉన్నపలంగా ఇద్దరు సీనియర్ పైలెట్లను ఉద్యోగంలోంచి టర్మినేట్ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. జనవరి 1న లండన్ నుంచి ముంబై వెళుతున్న విమానం గాలిలో అల్లంత ఎత్తున్న ప్రయాణిస్తున్న క్రమంలో విమాన కమాండర్.. మహిళా పైలెట్ పై చేయిచేసుకున్నారు. అమె కాక్ పిట్ వదిలి బయటకు వెళ్లినందుకు గాను ఆయన అగ్రహంతో అమె చెంపమీద కొట్టడంతో ఘర్షణ మొదలైంది. దీంతో తాను కూడా సీనియర్ పైలెట్ నేనని.. తనను కొడతావా అంటూ అమె కూడా కమాండర్ పై చేయిచేసుకోవడంతో గొడవ ముదిరి పరస్పరం కొట్టుకున్నారు. దీంతో మిగతా సిబ్బంది కలగజేసుకుని విమానం క్షేమంగా ల్యాండ్ అయ్యేలా చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
 
ఈ సంఘటనపై జెట్ ఎయిర్ వేస్ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘‘2018 జనవరి 1న లండన్ నుంచి ముంబై వస్తున్న 9డబ్యూ 119 విమానంలో జరిగిన వివాదానికి కారణాలను సమీక్షించాం. ఆ ఇద్దరు కాక్ పిట్ సిబ్బందిని తక్షణమే ఉద్యోగంలో నుంచి తొలగించాలని జెట్ ఎయిర్ వేస్ నిర్ణయించింది...’’ అని వెల్లడించారు. కాగా ఇప్పటికే వైమానిక నియంత్రణ సంస్థ డీజీసీఏ సదరు సీనియర్ పైలట్ ఫ్లైయింగ్ లైసెన్సును రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై ఆయన విమానాలు నడిపే అవకాశం ఉండదనీ... సాధారణ ప్రయాణికుల మాదిరిగానే విమానాల్లో ప్రయాణించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cockpitfight  pilots fight  jet airways  Pilots  crew  fighting  dismissal  termination  

Other Articles