SBI to cut minimum balance requirement ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పేనా..?

Sbi may cut minimum balance requirement for savings accounts

SBI minimum balance requirement,fine,Rs 3000,Rs 1000,urban areas,metros,penalty,SBI minimum balance,SBI minimum balance penalty,SBI minimum balance charges,savings account,saving account,charges,SBI,PNB,banks,State Bank of India, India News, Latest News

As per the list of revised charges of SBI, failure to minimum balance in accounts attracts a penalty of up to Rs 100 plus service tax. In metro cities, there is a charge of Rs 100 plus service tax, if the balance falls below 75 per cent of the minimum balance.

ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పేనా..?

Posted: 01/05/2018 11:13 AM IST
Sbi may cut minimum balance requirement for savings accounts

ప్రభుత్వ రంగ బ్యాంకు, దేశంలోనే అగ్రగామి బ్యాంకుగా ఖ్యాతిగడించిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో ఖాతాదారుల సేవింగ్స్ అకౌంట్ల కనీస నగదు నిల్వపై అంక్షలను పెట్టిన స్టేట్ బ్యాంకు తాజాగా తమ ఖాతాదారులకు ఊరట కల్పించే నిర్ణయాన్ని తీసుకుంది. కనీస నగదు నిల్వ విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటున్న ఎస్బీఐ ఈ విషయాన్ని సమీక్షించాలని నిర్ణయించింది.

కస్టమర్ల నుంచి వేల కోట్ల రూపాయలను చార్జీల రూపంలో వసూలు చేసి లాభాలను అర్జిస్తుందని అరోపణలు రావడంతో సేవింగ్స్ అకౌంట్లలో మినిమమ్ డిపాజిట్లను తగ్గించాలని నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం మెట్రో నగరాలతో పాటు గ్రేడ్ వన్ పట్టణాల్లో నెలవారీ నగదు కనీస నిల్వ రూ.3 వేలుగా ఉండగా దానిని  వెయ్యి రూపాయలకు తగ్గించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఎస్బీఐలో వున్న మొత్తం 40 కోట్ల 50 లక్షల మేర పొదుపు ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది.

గతేడాది ఏప్రిల్-నవంబరు మధ్య కనీస నిల్వను పాటించని ఖాతాదారుల నుంచి రూ.1,772 కోట్లు వసూలు చేసినట్టు తాజాగా ఎస్‌బీఐ ప్రకటించింది. అయితే అంతలోనే ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ప్రభుత్వ ఒత్తిడి ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న కనీస నగదు నిల్వ నిబంధనను రూ.1000కి తగ్గించాలని నిర్ణయించింది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గతేడాది జూన్‌లో ఎస్బీఐ కనీస నగదు నిల్వను రూ.5 వేలకు  పెంచింది.

ఖాతాదారుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో మెట్రో నగరాల్లో రూ.3 వేలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 కనీస నగదు నిల్వ ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతకు మించి తగ్గితే ఆయా ప్రాంతాలను బట్టి జరిమానా కింద  రూ.25 నుంచి రూ.100 వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. తాజాగా మినిమమ్ బ్యాలెన్స్ విధానంపై సమీక్ష జరపాలని, కనీస నగదు నిల్వను రూ.1000కు  తగ్గించాలని నిర్ణయించింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు పెదవి విప్పడం లేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minimum Charges  State Bank Of India  SBI  RTI  Ashish Das  Savings account  

Other Articles