BJP MLA threatens governor గవర్నర్ తీరు మార్చుకో: బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక

Bjp mla insists governor to clear files pending at raj bhavan

BJP MLA vishnu kumar raju, bjp mla threatens governor, telugu states governor esl narasimhan, narsimhan threatened by governor, bjp mla governor, vishnu kumar raju governog, pending files raj bhavan, Andhra pradesh

Andhra Pradesh BJP MLA vishnu kumar raju threatens telugu states governor esl narasimhan to clear files pending at raj bhavan orelse he will complain to the center.

గవర్నర్ తీరు మార్చుకో: బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక

Posted: 01/02/2018 04:47 PM IST
Bjp mla insists governor to clear files pending at raj bhavan

వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చేంటే ఏమిటీ అన్నట్లు.. రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా..? అన్న నానుడులను ఇప్పుడు గుర్తు చేసుకోక తప్పని పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. అధికారంలో వున్నామన్న ఒకింత ధైర్యం వారిలో మిండుగా వుండటం వల్లే ఇలా మాట్లాడుతారేమో తెలియదు కానీ.. ఏకంగా ఒక ఎమ్మెల్యే గవర్నర్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం మాత్రం నిజంగా రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేసింది. ఎక్కడో ఏదో రాష్ట్రంలోనో అనుకుంటే పోరబాటే ఏకంగా నవ్యాంధ్రలో బీజేపి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఫైర్‌ అయ్యారు.

గవర్నర్ నరసింహన్ రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించాలని, అయితే ఆయన తెలంగాణపై అధిక ప్రేమను కనబరుస్తూ.. ఇటు అంధ్రప్రదేశ్ పై మాత్రం సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణ పట్ల ప్రేమ చూపుతున్న గవర్నర్ నవ్యాంధ్రపై మాత్రం అదే ప్రేమను కనబర్చడం లేదని అన్నారు. తెలంగాణకు సంబంధించిన బిల్లి రోజుల వ్యవధిలో అమోదం తెలిపితే.. అదే తరహా బిల్లును అంధ్రప్రదేశ్ పంపితే నెల రోజులుగా పెండింగ్ లో నే పెట్టారని ఆయన అరోపించారు.

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్టసవరణ బిల్లును నెలరోజులుగా గవర్నర్ ఆమోదించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఇదే తరహా బిల్లును మూడు రోజుల్లో గవర్నర్‌ ఆమోదించారని ఆయన అన్నారు. గవర్నర్‌ తీరు మారకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని విష్ణుకుమార్‌ రాజు అన్నారు. నాలా చట్టం లేకపోవడం వల్ల ఏపీకి పరిశ్రమలు రావడం లేదని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఏపీలో నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గాలని, ఏపీకి పెట్టుబడులు రావాలంటే నాలా చట్టం కీలకమని, గవర్నర్ వెంటనే బిల్లును ఆమోదించాలని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp mla  governor  vishnu kumar raju  esl narsimhan  telugu states  andhra pradesh  

Other Articles